పుట:బసవపురాణము (పాల్కురికి సోమనాథుఁడు).pdf/165

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

130

బసవపురాణము


డును, ననంతామాత్యుఁడును నిట్టి ప్రయోగములఁ జేసిరి. 'మహేశుఁడయ్యుమా, యవ్వనవారి పూర్ణసురతాభి వివర్ధితుఁడై' - కుమారసంభవము 9 ఆశ్వాసము. 'వ్వ' ప్రాసలోనున్నది. 'నవ్వుచు - నీ యవ్వనలక్ష్మికిన్ భటుడు.' భోజరాజీయము 7 ఆశ్వాసము.

ప్రథమాదులమీఁద గసడదవాదేశము :- ప్రాచీనకృతులలోఁ బ్రథమావిభక్తిమీఁదను, ద్రుతాంతముగాని క్రియారూపములమీఁదను, కొన్ని యవ్యయముల మీఁదను, సంఖ్యాపరిమాణవాచకములమీఁదను, కొన్ని సమాసములలోను నుండు కచటతపలకు గసడదవలాదేశములగుట కానవచ్చును. ప్రథమాంతముల మీఁద నీ యాదేశము నిత్యమని యాంధ్ర భాషాభూషణాదులు పేర్కొన్నవి. క్రియావ్యయముల విషయమనిశ్చితముగా నున్నది. ప్రాంతవాఁతలలోఁదఱచుగా నీ యాదేశము కానవచ్చును గాని యదిలేని వ్రాఁతలును గొన్నిగలవు. ప్రాసస్థలముఁ జూచి వీనిని నిర్ణయింప నగును. అట్లచూడఁగాఁ కొన్ని యవ్యయములపై నిత్యముగా రాకపోవుట కానవచ్చును. కొన్ని క్రియలపై నవ్యయముల పైఁ గొందఱు కవులాదేశము చేసియుఁ, జేయకయును బ్రయోగించిరి. సంఖ్యాపరిమాణవాచకములపై మాత్రమీ యాదేశము నిత్యముగాఁగానవచ్చును. ప్రథమాంతముల మీద గూడఁగొందఱు వికల్పముగాఁ నీ యాదేశమును బాటించిరి. ఆంధ్రశబ్ద చింతామణ్యాదుల విశ్వసించి వ్యాకరణకర్తలు గొందఱాచ్చికములమీఁది తత్సమములకుఁ గలదని, తత్సమములమీఁది యాచ్చికములకుఁ గలదని, ఇంకేమోయని వ్రాసిరి గాని యది యెల్లఁ ద్రోసిపుచ్చఁదగినది. పరిశీలింపఁగా కళలపై నుండు పదాది కచటతపలకు, గసడదవలు బహుళముగా వచ్చుననుటయే చిక్కులేని నిర్వచనముగాఁ గానవచ్చుచున్నది. ప్రాచీనకాలమునఁ బ్రథమమీఁదను, గ్రియలమీఁదను గసడదవాదేశము బహుళముగానే కలదనుటకుఁ గొన్ని ప్రయోగములఁ జూపుచున్నాఁడను. 'ప్రా| త్రత గలిగెనేని నా కొస| గు తదీయాలోకనంబగు తెఱంగుగృపన్ | - 'లే | డుదలంప నశ్వమేధము' శాంతిపర్వము; కన్యాత్వమే నాకులే | దుగదా! నిర్వ-రామా-పొ | మ్ముకపివరేణ్య! నీ వనిన మోదితులై, 'మదీయంబైన మర్మంబు వీ | డు కృతఘ్నుండయిచెప్పెఁ