పుట:బసవపురాణము (పాల్కురికి సోమనాథుఁడు).pdf/163

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

128

బసవపురాణము

అవధారణార్థకము : పు. 9- 'పరమతత్త్వామృతంబయ చన్నుఁబాలు, ఇక్కడ 'అమృతంబు' పై నవధారణమున 'అమృతంబ' యగును గాని దానిపై మరల 'అ' వచ్చుట క్రొత్తగా నున్నది. యతికూడ హల్లుతోనే కలదు. తిక్కనగూడ నిట్లు ప్రయోగించినాఁడు. 'దరికొని తెగఁగాల్చునట్టిదయ యగుఁజుమ్మీ'; (ఉద్యోగ 2 ఆశ్వా). పు 205 - 'నలిగొన బొందితో ననకొనిపోఁడె', ఇటకూడ మీఁదిదానివంటిదే. ఈ 'తోనన' పలువురు ప్రాచీనకవులు ప్రయోగించిరి.

పసిబిడ్డ :- పు. 19- ప్రాత వ్రాతప్రతులలోఁ గొన్నింట 'పసుబిడ్డ, కలదు. అఱవమున 'పసుఁబిళ్లై' కలదు. పసరు, కసరు, శబ్దములకు పసు, కసు, పసి, కసి, రూపము లేర్పడినవి. పసరుఁబిందె, కసరుఁగాయ, పసిపిందె, పసుఁ బిందె, కసిగాయ, కసుఁగాయ, అని రూపములు గలవు. అట్టే యిదియును.

శిథిలద్విత్వము :- పు. 144 - 'అట్టయు నీడ్పించి యగడ్తవైపించె' కర్ణాట వ్యాకరణమున 'శిథిలద్విత్వము'ను గూర్చి యొక ప్రకరణమే కలదు. తెలుఁగున శిథిలద్విత్వప్రశంస గానరాదు. శిథిలద్విత్వమనఁగా సంయుక్తాక్షరము తేలఁ బలుకఁబడుట. దానిచేఁ తత్పూర్వాక్షరము లఘువగును. తెలుఁగున 'అద్రుచు, విద్రుచు, చిద్రుపలు,' అనుపదములు మాత్రమే యిప్పుడు శిథిలద్విత్వములనఁ దగినవి గానవచ్చుచున్నవి. కర్ణాట శిథిలద్విత్వములలోఁ గొన్నియైనను, దెలుఁగునఁ గూడఁ బ్రాచీనకాలమున శిథిలద్విత్వములుగా నుండియుండవచ్చును. 'యగడ్తవైపించె' నను నీ ప్రయోగ మందుకు స్పోరకము. తెలుఁగున నిప్పుడు 'డ' గా మాఱిపోయిన ఱ (జ్ష) అక్షరముగల పదమది. 'ఈ అగఱ్త' కర్నాటకమున శిథిలద్విత్వముగలదే "అగడితవైచె” అనుపాఠము పరిగ్రాహ్యముగా నాకుఁదోఁపకున్నది. 'ఈడ్పించి' యండుటచే 'వైపించె' అనియే తర్వాత నుండఁదగును. నన్నిచోడఁడు కూడ నిట్టి ప్రయోగములఁ జేసినట్టున్నాఁడు. 'శ్రీరామేశకవీశ్వరాదు లెడ్దనీ శ్రీపాదముల్', 'ఎడ' ఎద' అను రూపములను గొన్నచో నిక్కడ సరిపోవును గాని వ్రాఁతప్రతిలో ఎడ్డ' అని యున్నది గావున, నట్లే గ్రహింపఁదగును. కన్నడమున నదియు ఎఱ్ద' అని శిథిలద్విత్వము గలపదము. 'మొగుచు' ధాతువు; 'మొగుడు' ప్రేరణరూపమని శబ్దరత్నాకర కారులనిరి. అట్లే యగునేని యదియు