పుట:బసవపురాణము (పాల్కురికి సోమనాథుఁడు).pdf/162

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పీఠిక

127

యుష్మదస్మత్సమాహార సంప్రార్థనాద్యర్థక క్రియ : పు. 149 - 'చెప్పుదండు', పు. 174 - 'చెఱుపుదండు', పు. 179 - 'పోదండుగాక', పు. 215 - 'చూతండు' పండితారాధ్యచరిత్ర 2వ ప్రకరణమున పడుదండు', 'ఉండుదఁడు', 'తీర్తండు' ఇత్యాదులు పెక్కులు. ఇవి యితరకవుల కృతులలో చెప్పుదుము, చెఱుపుదము, పోదము, పొదము, పదము, పదండు, చూతము, పడుదము, ఉండుదము తీర్తము అను రూపములతో వ్యవహృతము లగుచున్నవి. ఒక్క 'పోవు' ధాతువునకు మాత్రమీ కవి ప్రయోగించిన 'పోదండు, పొదండు,' 'పొదరు' రూపము లితర కవులును ప్రయోగించిరి. తక్కిన ధాతువులపై నాకిట్టి రూపములు శివకవుల కృతులలోనే తక్కనిఁక నెక్కడను గానరాలేదు ఈ రూపములు క్రొత్తగా నున్నవి.

పదాంతాజ్లోపము : పు. 12- 'వెల్విరియ', పు. 28- 'ఎదురుకొన్వేడ్క' పు. 101- 'నేఁడ్వింతవాఁడొకఁడు, పు. 269- 'భాషా ప్రణీతమన్బడు బల్లగోల, 'త్రాడ్పేన,' - 'నేలఁబడి పొరల్ కూయిడు, గుడిసొచ్చు గుడివెడల్' - పండితా. - ఇత్యాదులు. కొన్ని శబ్దముల తుదియచ్చు లోపించుట ప్రాచీన గ్రంథములలోఁ బెక్కింటఁగానవచ్చును. 'వసివాళ్వాడు', 'కడివోయినవాళ్ ముడువంగ, 'గ్రుక్కిళ్మింగు' ఇత్యాదులు. ను, లు, రు, వర్ణాంతశబ్దములకు నువర్ణాంతధాతువులు క్రియాజన్యవిశేషణములుగా నున్నప్పుడు వాని యుకారమునకును గూడ లోపముగలదు. కాని 'వెలివిరియు' 'వెల్ విరియు' గాను, 'అనఁబడు' 'అన్బడు' గాను, 'పొరలును కూయిడును' పొరల్‌కూయిడు' గాను, 'వెడలును' 'వెడల్' గాను మాఱుట క్రొత్త. ఇట్టిదే 'విప్రసతికి నూఱు వేఁడఁ జన్ వరములు' - నన్నయ, సభాపర్వము. నేఁడు, త్రాడు శబ్దములు తొలుత 'నేళ్' 'త్రాళ్' గా నుండినవి గావున నవి 'వాళ్వాడు' వలె మాఱుట సంగతమే. మఱియు 'తివ్యు' 'కుర్వు' 'నుస్లు' ఇత్యాదులఁగూడ నీతఁడు ప్రయోగించెను.

'అంబుజనేత్రి' పు. 8- ప్రాచీనకృతులలో నిట్టిరూపములు శాసనము లలోఁ దఱచుగా నున్నవి. 'అబ్జనేత్రి', 'కోమలీ', 'కుసుమకోమలి', 'వల్లభ' 'నయనవల్లభి' 'పల్లవాధరి', 'బాలకి' ఇత్యాదులు యతిస్థలములందు దిద్దరానివై కూడఁ గలవు.