పుట:బసవపురాణము (పాల్కురికి సోమనాథుఁడు).pdf/161

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

126

బసవపురాణము


'మా భక్తులొద్ద' బడుగులాదరువ', పు. 102- పురోహితులను మతము;' ఇత్యాదులు. షష్ఠీసమాసమున విభక్తిలోపమును, అకారముపై సంధియు సర్వప్రాచీనకవి సమ్మతము. ఇట్టి ప్రయోగములననేకులు ప్రయోగించిరి.

కుషష్ఠి : పు. 203 - 'ఈశుకు బసవఁడు,' 'కంతుసంహరుకెన', పు. 209, 226 - 'కరికాల చోడుకు', 'పుడమీశుకొల్వుకు,' ఇత్యాదులు. ఇట్టివి క్వాచిత్కముగాఁ బ్రాచీన కృతులలో నున్నవి.

సంబోధనమున సంధి :- పు. 184, 216- 'ఎఱుఁగరెజైనులా రెన్నఁడు మీరు, 'ఓడులారేటికి'. పండితారాధ్యచరిత్రమునను నిట్టి సంధులు గలవు. ఇవి యితర కవుల కృతులలో నాకుఁ గానరాలేదు.

'మహత్తులపై 'రో :- పు. 64 'వీరభద్రయ్యరో, 'పు. 68 - 'వీరెవ్వరయ్యరో యనుచు, దేవరో, బసవరో, ఇత్యాదులు. “రో" మహతీ వాచకముల మీఁదనే యుండు ననుట సరికాదు. ఇతర కవులు గూడ మహద్‌వాచకములపై 'రో ' చేర్చిరి.

నెట్టణ :- 'ఇట్టి నెట్టణభక్తి యిట్టి ముగ్ధత్వము,' - 'నెట్టణ భక్తికి నిలుకడయగుచు,' 'నెట్టణశరణుండ నిర్మలాంగుండ,' - ఇట్టివి పెక్కులు. 'నెట్టన' పెక్కు గ్రంథములందుఁ గలదు. అది క్రియావిశేషణముగాఁగానవచ్చు చున్నది. ఇక్కడ విశేష్యముగా నున్నది. ప్రాచీనకృతులలో నిది విశేష్యముగాఁ గూడఁ బ్రయుక్తమయినట్టున్నది. శబ్దరత్నాకరమున 'నెట్టన' చూచునది. 'నెట్టనము' అని రూపాంతరమును గలదు.

మహ మా :- పు. 180- 'మహలింగమూర్తి, పు. 213- 'ఈమా(మహా) జనము' ఇత్యాదులు పెక్కులున్నవి. మహచ్ఛబ్దము 'మా' అగునని కర్ణాట వ్యాకర్తలు చెప్పిరి “మహచ్చబ్దక్కుద్బవిక్కుం మా దేశం దోషవిల్ల సంస్కృతపదం పరక్కొదవలోడం” శబ్దమణిదర్పణము. దీని కుదాహరణములు మాదేవ, మాకాళి, మాదాని, మాశౌర్య పదములు. ఇదియు నట్టిదే.