పుట:బసవపురాణము (పాల్కురికి సోమనాథుఁడు).pdf/160

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పీఠిక

125

పెండ్లిండ్లు : పు. 23 - నేఁడు 'పెండ్లిండ్లు' అని యెల్లరు వ్యవహరించుచున్నారు. పెండిలికి బహువచనము 'పెండిండ్లు' అగుటయే సరి. ఈ రూపము నీ కవి 'పెండిండ్ల నోములఁ బేరంటములనుఁ - బండువుదినముల' అని ప్రాసలోఁ బ్రయోగించినాఁడు.

పు. 80 - 'ఒల్వువడు' - 'ఒలుచు' ధాతువునకుఁ గృద్రూపము నేఁడు 'ఒల్పు' గాఁ గానఁబడును. చువర్ణాంతములయిన ధాతువులకుఁ బెక్కింటికి నేఁడు కృద్రూపమున 'పు' వర్ణము గానవచ్చుచున్నది. ఊడుచు-ఊడుపు, గెలుచు-గెలుపు, తాలుచు- తాలుపు, ఇత్యాదులు. సోమనాథుని కాలమున నివి 'వు' వర్ణాంతములుగా నుండెడివి. 'తారకుం బోరగెల్వున్, చిరముగ నొల్వువడ్డ', - కుమారసంభవము 1,5 ఆశ్వాసములు. మన సోమనాథుఁడే 'బిల్వపత్రిని నెలదాల్వుఁ బూజించి' అని పండితారాధ్యచరిత్రమునఁ బ్రయోగించినాఁడు. ఇది లేఖకప్రమాదమని దిద్దరానిది. 'అరియవట్టనమున ఊడ్చిన ఊడ్వునేల, - క్రీ.శ.1121 నాఁటి శాసనము[1] ఇట్టివి పెక్కులు.

క్వార్థక సంధులు : పు. 31- ఏ వేళ వెఱచుండుము.” (నిర్వచనోత్తరరామాయణమున 'వెఱచిట్లంబుధినాథనందనులు' అని తిక్కన ప్రయోగించెను. పు. 76 - ' ఊచవోయున్న భావమున' పు. 105- 'ఎలుఁగు వి నేతెంచి, పు. 153 - 'ఏ తెంచారగించె, గలిగున్న దనుచు' పు. 160- 'కట్టెగసల్లంత, 'పులుగఱచు మియుచు' 'ఏటువడీల్గఁడే'; పు. 202-'కలిగుండువాఁడు, పు. 185 - 'అంజలి ముంచెత్తు నమ్మాత్రలోన', పు. 215- ఇట్టివి క్వార్థకేకారసంధులు పెక్కు లీ కవి గ్రంథమునఁ గలవు.

ఇకారసంధులు : పు. 44 - పత్తిరీగొడ్డునందు, పు. 81- పడఁతర్ఘ్య పణ్యముల్, పు. 116 - 'కంచేడువాడలు' ఇత్యాదులు గలవు.

షష్ఠీసమాసము: పు. 45-సత్యమాహేశ్వరులిండ్ల, పు. 116 - 'గతిహీనులిండ్ల, పు. 155- ఇతరులిండ్లైన', పు. 171 - 'వేల్పులొడయండు, జిన భక్తులిండ్ల, పు. 240

  1. చూ. దక్షిణ హిందూదేశ శాసన సంచయము, IV వాల్యుం . 479 పుట.