పుట:బసవపురాణము (పాల్కురికి సోమనాథుఁడు).pdf/156

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పీఠిక

121


అసాధారణ ప్రయోగములు

కర్ణాటాంధ్రలాక్షణికులు కావ్యదోషములలో గణించిన 'వైరిపద' మనుశబ్దదోషము వీరి కృతులలోఁ బెక్కుచోట్లఁ గానవచ్చుచున్నది. వైరిపదము దోషమని గర్హించిన ప్రాచీనకవులే కొందఱు వానిని దఱచుగాఁ బ్రయోగించుట వింతగా నున్నది. సోమనాథుఁడు పండితారాధ్యచరిత్రమున 'వైరిపదము' ను గర్హించెను. కవిజనాశ్రయము, ఆంధ్రభాషాభూషణము, కావ్యాలంకారచూడామణి, ఛందోదర్పణము మొదలగు గ్రంథము లీ దోషమును బేర్కొన్నవి. అయినను, నన్నయాదుల కృతులలోఁగూడ నిట్టి వైరిపదములు కొన్ని గానవచ్చుచున్నవి. అర్వాచీనలాక్షణికు లనింద్యగ్రామ్యములని యట్టివానిని గొన్నింటిని గణించిరి. ప్రాచీనులట్టి వానిని వైరిపదములనియే పేర్కొనియు ప్రయోగించిరి. వైరిపదమనఁగా సంస్కృతాంధ్రపదముల విరుద్దసమాసము. సోమనాథుఁడు బసవపురాణమున మాత్రము ప్రయోగించిన వైరిపదములఁ జూపుచున్నాఁడను.

పు. 6- 'దీపగంభంబులు', పు. 15- 'చౌదళాబ్జంబు', పు. 26 'ముల్లోకవంద్య', పు. 30-'ముల్లోకనుతుఁడు', పు. 240- 'ముల్లోకనాథుని', పు. 44- 'నిత్యనేమంబు', పు. 55 - 'నిత్యపడి', పు. 134-'నిత్య', (ఇట్టివి పెక్కుమార్లు), పు. 55- 'పుడమీశ', పు. 60,62 - 'సర్వాంగకచ్చడము', పు. 124- 'భక్తకూటువలు', పు. 178 - 'మజ్జనబావి', పు. 201- 'ఇతరవేల్పులు', పు. 44,205-'తవనిధి', పు. 249 - 'తవరాజు', పు. 185-'తవరాజవల్లభుఁడు', పు. 201 - 'సిరిమహాదేవాదిసురలు', 140 ధర్మకవిలె, ఇత్యాదులు. పరిశోధింపఁగా నీ పదములు, సోమనాథుని కాలమున బాహాటముగా నాంధ్రశైవకావ్యములందుఁ బ్రయోగింపఁబడుచుండినట్లు గానవచ్చుచున్నది. ద్రవిడకర్ణాటభాషలలోను, దత్కాలపుఁగృతులలో నిట్టివి కొన్ని గానవచ్చుచున్నవి. కొన్నింటిని బేర్కొనుచున్నాఁడను

దీపగంభములు : కంభమని సంస్కృతశబ్దము లేదు గావునను, ఉన్నదనుకొన్నను, దెనుఁగుసంధి చొప్పున క, గ యగుట యసంగతము గావునను, నిది వైరిసమాసమే. తెనుఁగుపలుకులలోఁ గొన్నింట, వర్గద్వితీయ చతుర్థాక్షరములు