పుట:బసవపురాణము (పాల్కురికి సోమనాథుఁడు).pdf/151

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

116

బసవపురాణము


బ్రాఁతిగా నాదివరాహదంష్ట్రంబు
ఖ్యాతమీశ్వరుచేతఁగాదె యున్నదియు -బసవ పు. 203

బూది దా రాఁజదు వొగయదు దాను
నూఁదండు ముట్టించె నొక్కదీపంబు -బసవ పు.15

షోడశపండువు సూడఁబోదండు
పోఁడిగా నీపాలు పురహర! కొనుము ! -బసవ పు. 71

ఊఁదు సార్ధానుస్వారముగా శబ్దరత్నాకరమునఁగలదు. అది సార్దానుస్వారమే యని నిర్ణయించుటకుఁ బ్రబలప్రమాణము కావలెను.

చీరసించుచు విప్రులాఱడి వైచి
కారించుతఱి నుదకము లేదు గంట. -బసవ పు. 83

అతిముఱిఁ జన్నఁబాలర్థించివేఁడఁ
జిఱుతచే నొకపిండికరు డిచ్చితల్లి. పుట.120

తారొండె శివుఁబంపఁదగదన్న వారు
గారొండె నంబికి వేఱొక్కభృత్యు. -బసవ పు. 133

'ఆరడి' యని సాధురేఫముగాఁగూడఁ గొందఱు ప్రయోగించిరి.

యతివిశేషములు

మూఁకకు నెగయుచు ముస్సుముస్సనుచు - బసవ పు. 160

అనుచోట నేఁటి వ్యవహారము చొప్పున “బుస్సుబుస్సనుచు” యని యుండఁ దగుననియు నది యప్పకవ్యాదులు పేర్కొన్న 'ముకారయతి' యగుటచే సాధువే యగుననియుఁ దలఁపఁదగియున్నది. కాని, వ్రాఁతప్రతులలో “ముస్సు ముస్సనుచు” అని యుండుటచే నట్లే యుంచితిని. అప్పకవి చెప్పిన చొప్పున ముకారయతి ప్రాచీనకృతులందు నా కెక్కడను గానరాలేదు. అప్పకవి ముకార