పుట:బసవపురాణము (పాల్కురికి సోమనాథుఁడు).pdf/127

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

92

బసవపురాణము


డును, బుష్పగిరి మఠాధిపతియు నగు సోమశివాచార్యుఁడే కాకతీయ ప్రతాపరుద్రుని పాలనమున క్రీ.శ. 1282 నాఁడు కట్టించెను. ఆయన విగ్రహము గూడ నక్కడఁగలదు. పెక్కుగ్రామములందు వారి ధర్మప్రతిష్ఠలు గలవు. కృష్ణరాయల కాలమున నున్నవారును, ముక్కుతిమ్మనాదులకు గురువులు నగు నఘోరశివాచార్య దక్షిణామూర్తి శివాచార్యులు, వీరి సంప్రదాయమువారే. సూత్రభాష్యకారుఁడు, శ్రీకంఠ శివాచార్యుఁడు గూడ నీ పరంపరలోనివాఁడే యగుననుకొందును. వీరి యుద్బోధముచేతనే కాఁబోలును బ్రతాపరుద్రుని కాలమున నాంధ్రదేశ శివాలయములలోఁ బెక్కింటఁ దమ్మళ్లు తొలఁగింపఁబడి, వెలనాటివారు పూజారులుగా నిలుపఁబడిరి. ఈశానశివాఘోరశివాదులు రచించిన దీక్షాప్రతిష్ఠాది నిబంధనముల ననుసరించియే నేఁ డాంధ్రదేశ శివాలయములలో నుత్సవాదులు నడిపింపబడుచున్నవని నేఁ దలఁచున్నాఁడను. శైవాగమసమ్మత మయిన వైదికప్రక్రియచేతనే యారాధ్యు లాయుత్సవాదుల నేఁడును నడుపుచున్నారు. ఆంధ్రారాధ్యసంప్రదాయము పూర్వకాలమున నీ శివాచార్యపరంపరవారి సంప్రదాయముగానే యుండెనని నేను దలఁచుచున్నాఁడను. పెక్కువిధములఁ జూడఁగా నాంధ్రారాధ్యసంప్రదాయ మిట్టిదిగాఁ గానవచ్చుచున్నను, లింగధారణము, కరపీఠార్చనము. షట్‌స్థల వివేకము మొదలగునవి వీరశైవసంప్రదాయోద్భూతములు గొన్నిగూడఁ గలసియుండుటచే వీరును వీరశైవులేమో యనియు సంశయము గల్గును. వీరశైవులకు ముఖ్యమయిన వైదికకర్మత్యాగము, కులాశ్రమాచారత్యాగము, అన్యదేవతారాధనత్యాగము మొదలగు వీరవ్రతములు వీరికి లేకుండుట యట్టి సంశయమునకుఁ బ్రబలబాధకముగాను నున్నది. ప్రాచ్యలిఖితపుస్తకశాలలో 11-5-16 అని సంఖ్యగల ప్రాచీనతాళపత్రగ్రంథమున గోదావరీతీరమున నొకస్వాములవారు ప్రాచీనగ్రంథములను శైవసంప్రదాయములను జక్కఁగాఁ బరిశోధించి, యక్కడి బ్రాహ్మణులకు వ్రాసిన పత్రిక యొకటి గలదు. అది యిప్పటి కిన్నూఱేండ్ల క్రిందట వ్రాయఁబడినదై యుండును. ఆనాఁటికి రెండువందల యేండ్లకుఁ బూర్వము ఆంధ్రదేశమువారు 66 కుటుంబములవారు బ్రాహ్మణులు శ్రీశైలమున కేఁగి యక్కడ లింగధారణదీక్ష గొనిరనియు, కొంద ఱక్కడనే వీరశైవులై