పుట:బసవపురాణము (పాల్కురికి సోమనాథుఁడు).pdf/126

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పీఠిక

91


పరంపరవారు పలువురు శివాచార్యు లుండిరి. బసవపురాణములో వారి పేళ్లు చూడఁదగును. ఏతన్మఠపరంపరవారు వేలకొలఁది మహనీయులు దక్షిణాపథమెల్ల వ్యాపించిరి; కేరళమునకుఁగూడ నరిగిరి; మఠముల నెలకొల్పిరి. కృష్ణలీలాశుకుని గురువగు నీశానశివాచార్యుఁడు కేరళమందుండినవాఁడు. ఆయన చోళరాజగు రాజరాజచోళునకును గురువై యుండెను. ఈశానశివగురుదేవపద్ధతి శివ, ధర్మశివ, విశ్వేశ్వరశివాదులు తెలుఁగుదేశమునకుఁ జేరిరి. విశ్వేశ్వర శివాచార్యుఁడు కాకతీయగణపతి చక్రవర్తికి శివదీక్షాగురుఁడై, తండ్రియై (దీక్ష నొసఁగుట చేతనా?) యాంధ్రదేశమునఁ గృష్ణాతీరమునఁ మందర గ్రామమున గొప్పమఠము నెలకొల్పను. తా నందు నెలకొనెను.

శ్లో. శ్రీ చోళేశ్వర మాలవక్షితిపతీ రాజన్యచూడామణీ
    యచ్చిష్యౌ కిమతః పరం గణపతి క్షోణీపతి ర్యత్సుతః,
    న స్యాత్కస్య ముదే స దేశికవరశ్ళైవాగమాంభోనిధి
    శ్రీవిశ్వేశ్వర దేశికః కలచురిక్ష్మాపాల దీక్షాగురుః.
    త్వంగత్పింగ జటాకిరీట ముదయస్మేరారవిందాననం
    ముక్తాకుండలమండితాం సశిఖరం హారై ర్మనోహారిణమ్,
    విద్యామంటపవర్తినం గణపతిక్ష్మాపాల దీక్షాగురుం
    శ్రీవిశ్వేశ్వరశంభు మీక్షితవతాం తే చక్షుషీ చక్షుషీ.

- మల్కాపుర శాసనము.

కాళేశ్వరము, పొన్నగ్రామము, మంద్రకూటము, మానేపల్లి, ఊటుపల్లి, చంద్రవల్లి, కంభంపల్లి, ఆనందపురము, కొమ్మూరు, శ్రీశైలము, వెల్లాల, ఉత్తర సోమశిల మొదలగు గ్రామములందు శివాలయములను, మఠములను నీతఁడు నెలకొల్పను. వీరి పరంపరవారు తెల్గుదేశమున కృష్ణదేవరాయల తర్వాతి కాలముదాఁక గూడఁ బలువురు ప్రఖ్యాతులై యుండిరి. శ్రీనాథునిచే నోడింపఁబడిన డిండిముఁ డీ పరంపరవారికి సంబంధించినవాఁడే. నేఁ డద్వైతమతాచార్యపీఠములుగా నున్న విరూపాక్ష, పుష్పగిరిపీఠము లానాఁడు వీరు నెలకొల్పిన శైవమఠములే. పెదకళ్లేపల్లిలో శివాలయము నీ సంప్రదాయమువాఁ