పుట:బసవపురాణము (పాల్కురికి సోమనాథుఁడు).pdf/118

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పీఠిక

83


శ్లోకములనుబట్టి యాయామతముల స్థూలస్వరూపములను మాత్రము గనుఁగొన సాధ్యమగును. ఆ కాలపుఁ దంత్రగ్రంథములును, నాగమగ్రంథములును, నాయామతములవారి యనుష్ఠాననిబంధములును నేఁడు పర్యాప్తముగా మనకు దొరకుటలేదు. విద్యారణ్యులవారి సర్వదర్శనసంగ్రహమునఁ బాశుపత శైవమతములు నిర్వచింపఁబడినవి. బ్రహ్మసూత్రములకు శ్రీకంఠశివాచార్యులు రచియించిన భాష్యము విశిష్టాద్వైతసిద్ధాంతమును వాసుదేవుఁడని, శివుఁడని యనుటలోఁదక్కఁ దక్కినవిషయములం దంతగా భేదములేదు. అప్పయదీక్షితులవారి కాలమున నుండియే యీ గ్రంథ మెక్కువ వ్యాప్తిఁ జెందినట్టు గానవచ్చుచున్నది. కావున నిది యంతగాఁ బ్రాచీనమయినది గాకపోవచ్చుననియు నప్పయదీక్షితులవారి కాలముననో యంతకించుక పూర్వకాలముననో, రచితమై యుండవచ్చు ననియుఁ గొందఱునుచున్నారు. రామానుజులవా రీ శ్రీకంఠభాష్యమునే వరవడిగా నుంచుకొని తమ శ్రీభాష్యమును రచించిరనియు, నీ శ్రీకంఠ శివాచార్యులు శంకరులనాఁటి వారనియుఁ గొంద ఱనుచున్నారు. ఈ విషయ మిట్లుండఁగా నీ నడుమ బ్రహ్మసూత్రముల పయి శ్రీపతి పండితారాధ్య రచితముగా శ్రీకరభాష్యమని యొక గ్రంథము బయల్పడినది. ఇది శ్రీపతిపండిత రచితము గాదనియే నా నమ్మకము. శంకరాద్వైతము ప్రబలిన పిదప నాగమతంత్రమతములవారు గూడ, దమ మతములు బ్రహ్మసూత్రాభిప్రేతములే యని నిరూపించుటకు యత్నించిరి. స్వసిద్ధాంతానుసారముగా బ్రహ్మసూత్రములకు భాష్యముల రచించిరి. ఈ పూన్కి శంకరులకుఁ బూర్వకాలమున నున్నట్టు గానరాదు.

శ్రీకంఠభాష్యమునఁగాని, శ్రీకరభాష్యమునఁగాని పాశుపత కాలాముఖాది శైవమతభేదముల స్వరూపములు గానరావు. వీరాగమ వాతూలాగమాదులు కొన్ని శైవమతములను నిరూపించునవి గలవు.

శ్రీశైలము శైవమతస్థుల కునికిపట్టుగా నుండి తత్తన్మతముల కభ్యుచ్చ్రయము గల్గించుచుండుట యాకాలమున దక్షిణాపథమునఁ జైనబౌద్ధమతముల వ్యాప్తికిఁ గొంత యడ్డంకిగా నుండెను. ఈ యడ్డంకిని దొలఁగఁద్రోసికొనుటకై బౌద్ధు లయిన