పుట:బసవపురాణము (పాల్కురికి సోమనాథుఁడు).pdf/105

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

70

బసవపురాణము

నమినంది - నేమినంది నామాంతరము

పిళ్లనైనారు - పు. 174 తిరుజ్ఞానసంబంధి నామాంతరము. సౌందర్యలహరిలో శంకరాచార్యులవారు 'ద్రవిడశిశు'వని యీతనినే ప్రశంసించిరి. వాగీశ, నక్కనైనార, హరదత్తాచార్యాదుల కీతఁడు సమకాలమువాఁడు. వైష్ణవుల పన్నిద్దఱాళ్వారులలో నొకఁడగు తిరుమంగైయాళ్వారుతో నీతఁడు భాషించెనట.

కలికామదేవుఁడు - పు. 132

తిరుమూలదేవుఁడు - పు. 140

నాట్యనమిత్తండి - పు. 79 దండియడిఘళ్. బసవపురాణమున నున్న కథవేఱు. పెరియపురాణకథ వేఱు.

సాంఖ్యతొండఁడు - పు. 179 తెలుగున సర్వత్ర 'సాంఖ్య' అనియే యున్నదిగాని యాతఁడు శాక్యుఁ డగుటచే శాక్యతొండఁడని యుండఁదగును. అఱవమున నట్లే కలదు.

చిఱపులి - పు. 140 శిఱపులి, నిరోధిశార్దూలుఁడు అని నామాంతరములు.

చిఱుతొండఁడు - పు. 140 సిరియాలుఁడు, దభ్రభక్తుఁడు నామాంతరములు. ఈతఁడు రెండవపులకేశిని జయించి, వాతాపికోటను బట్టుకొని తన రాజున (మొదటి నరసింహవర్మ?) కొసఁగెను. ఈతఁడు సేనాధిపతి. కాంచీపురవాస్తవ్యుఁడు. క్రీ.శ. 630 నాఁటివాఁ డగును. ఈతని కొడుకు సీరాలుఁడు; భార్య తిరువెంగాణి; దాసి చంద(న)నంగ.

అడిభర్త - పు. 136 అదిపత్తర్ అతిభక్తర్ నామాంతరములు.

కళియంబనైనారు - పు. 137 కలికంపఁడు, కలికంబఁడు నామాంతరములు.

సుందరపాండ్యుఁడు - పు. 176 కుబ్జపాండ్యుఁడు కూనపాండ్యుఁడు, గూనిపాండ్యుఁడు నామాంతరములు. జినసేన భట్టాకలంకాదు లీతని జైనునిఁ జేసిరి. పిదపఁ దిరుజ్ఞానసంబంధి శైవునిఁ జేసెను.