పుట:బసవపురాణము (పాల్కురికి సోమనాథుఁడు).pdf/104

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పీఠిక

69

చేదివల్లభుడు - పు. 137 సిద్దిరాజని నామాంతరము.

ఇఱువదాండారి - పు. 104 ఇరుపత్తుఁడు ఇఱిపత్తనాయనార్. ఎఱిపత్తనాయనార్ అని ద్రవిడకర్ణాటములందుఁ బేరు. సంస్కృత బసవపురాణమున ఇరువత్తుఁడని కలదు.

కరయూరిచోడఁడు - పు. 137 కరపూరిచోడఁడని కన్నడము. పొగ్హళ్ చోళఁ డని యఱవము.

ఏణాధినాథుఁడు - పు. 136 ఏణాదినాథుఁడని యఱవము సంస్కృత బసవపురాణమున ఏణాధినాథుఁడనియే కలదు.

ఉడుమూరి కన్నప్ప - పు. 78 కణ్ణప్పన్. శ్రీకాళహస్తివాఁడు.

గుగ్గులుకళియారు - పు. 135 కంకుళినాయనార్ అని యఱవము.

మానకంజారుఁడు - పు. 57 చోళరాజు.

అరివాళునాయనారు - పు. 135 సంకులాదాయుఁ డని నామాంతరము. శూద్రుఁడు.

రుద్రపశుపతి - పు. 63 తెలుఁగు బసవపురాణమున నున్న కథ వేఱు; అఱవమునను, గన్నడమునను నున్నకథ వేఱు. తెలుఁగుకథలో 'ఆదిపురాణ' మని ద్రవిడ శివపురాణము పేరున్నది. అఱవమున నట్టిగ్రంథము తెలియరాదు.

చండేశుఁడు - పు. 228

తిరునావుకరశు - పు. 172 అప్పర్ అని నామాంతరము. ఈతఁడు తిరుజ్ఞానసంబంధి కుజ్జపాండ్యుల సమకాలమువాఁడు. ద్రవిడమున గొప్పకవి.

కరికాళవ్వ - పు. 69 పూతవతి నామాంతరము.

నక్కనైనారు - పు. 66 తిరునీలనక్కనైనార్, నీలనగ్న, మురుగర్ నామాంతరములు.