పుట:బసవపురాణము (పాల్కురికి సోమనాథుఁడు).pdf/102

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పీఠిక

67


పరమనాచియరు దీపదకళియారు
కరిగణనాథుండు గరికామదేవుఁ
డమరనీతి యిరువదాండారి మురుఘు
నమినంది యేణాధినాథుండు సాంఖ్య
తొండభూపతి చిరుతొణు తిరుకురిపి
తొండండు నంబి సిర్తొండండనంగ
సీరాలదేవుండు సేదిరాజయ్య
గారికాళవ్వ యేకాశి సోమాసి
మారుండు వీరపెర్మాణిదేవుండు
వీరచోడఁడు జడయా రిరిత్తాండి
యెల్వచలంది వాగీశనైనారు
కొళ్వుళి యెళయదంగుళియ నైనారు
చిఱుపులియారు లచ్చిరియారు నారు
మిఱుమిండయారు నమిత్తండయారు
కరియంబ యరిపాలు కడమలనంబి
కళియంబ గుగ్గుళ కళియనైనారు
కన్నప్పతాపసి కరయూరచోడు
చెన్నయ్య చోడండు చేరమరాయఁ
డిడుగుడిమారయ్య నిడుమారదేవుఁ
డడిభర్తయణుమూర్తి యఱువత్తుమూరు.

సంఖ్య కఱువదిమూగురే యయినను సంస్కృత కర్ణాటద్రవిడ గ్రంథములలో వారిపేళ్లు గొన్ని భేదించుచు నెక్కువగుచున్నవి[1] ఒకగ్రంథమున బేర్కొనఁబడినవారిని

  1. కన్నడమున - 'అఱువత్తుమూవుర పురాతనచరితె' 'త్రిషష్టి పురాతనచరితె' “అఱువత్తుమూరు పురాతనశరణరచరిత్రె, సంస్కృతమున - స్కాందోపపురాణ, శివరహస్య, శివభక్త మాహాత్మ్యములు; తమిళమున - పెరియపురాణము.