పుట:బసవపురాణము (పాల్కురికి సోమనాథుఁడు).pdf/10

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

iii


వైదికమతమునం దప్రధానముగ నున్న కర్మ బౌద్ధమతమునందుఁ బ్రధానస్థానము నాక్రమించినది. జాతి, మత, కులభేదములు లేక, శుభాశుభకర్మఫలము "లవశ్యమను భోక్తవ్యం” అను సిద్ధాంతము హిందూమతమునందు సుప్రతిష్ఠితమైనది. కర్మసిద్ధాంతము, పునర్జన్మసిద్ధాంతము హిందూబౌద్ధమతములందు సమానప్రతిష్ఠను బడసినవి. జైనబౌద్ధమతములు 1000 ఏండ్లు భరతఖండమునందుఁ బ్రబలినవి. దేశమునందంతటను మఠములు, విహారములు, స్తూపములు వెలసినవి. సన్న్యాసులు, శ్రమణకులు వేనవేలు దేశమునందంతటను వ్యాపించిరి. దైవారాధనలేని బౌద్ధమతము సంకరమై, ప్రాణప్రతిష్ఠలేక, ప్రజాజీవనమునకు నిరర్థకమైనది. శంకరాచార్యులు జైనబౌద్ధమతములను ఖండించి వైదికమతమును బునరుద్దారణ చేసెను. శంకరాచార్యులు జైనబౌద్ధమతములను ఖండనము చేయుచు శైవవైష్ణవాది షణ్మతముల నామోదించెను. శంకరాచార్యులు కర్మసిద్ధాంతమును, పునర్జన్మసిద్ధాంతమును సర్వాత్మత్వసిద్ధాంతముతోను, సర్వబ్రహ్మసిద్ధాంతముతోను మేళవించి, వైదికమతపరిణామమును వేదాంతమునందు సార్థకము చేసెను. వైదికమతసంప్రదాయములైన ద్వైతాద్వైతవిశిష్టాద్వైతమతములు స్థాపితములై, వైదికకర్మలు, జాతికులభేదములు పుష్టిని పొందినవి. ప్రాకృతజనులు జీవయాత్రయందుఁ గడతేరుటకు వైదికకర్మల కనధికారులు. జ్ఞానమార్గము దుర్గమము. ఈ విషమదశయందు రామానుజుఁడు, చైతన్యుఁడు, బసవేశ్వరుఁడు మొదలగు మహాభక్తులు బయలుదేరి ప్రజాజీవనమును సుఖప్రదము చేయుటకుఁ బూనుకొనిరి.

భక్తిమార్గము

వ్యక్తావ్యక్తములకును, కర్మజ్ఞానమార్గములకును, సగుణనిర్గుణోపాసనములకును మానవహృదయమునందు భక్తిమార్గము సంధిబంధనముగ నున్నది. రుద్రేంద్రవరుణాగ్ని దేవతార్చనలతో నారంభమైన వైదికమతము "సర్వం ఖల్విదం బ్రహ్మ' యనుతత్త్వపరిజ్ఞానపరిణామమును బొందినది. ఈ పరిణామాంకురములు ద్వైతాద్వైతములందును, శైవవైష్ణవములందును, నిర్గుణసగుణోపాసనలందును, కర్మభక్తిజ్ఞానయోగములందును, నిగమాగమ