Jump to content

పుట:ప్రభావతీప్రద్యుమ్నము (పింగళి సూరన).pdf/57

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


దోఁచుచున్నది యని చెప్పుటయు నవహితమానసుండై
యాకర్ణించి.

145


శా.

ధారుణ్యాభరణాయమానబుధతాధారుండు భూమోల్లస
త్కారుణ్యామృతశైత్యనిత్యదృగలంకారుండు నేత్రాంతగా
హారుణ్యాంకురకల్పితారిమదసంహారుండు కీర్త్యంగనా
తారుణ్యాంగళనౌషధాభిజనవిస్తారుండు శూరుం డనిన్.

146


క.

సారతరవైదికసమా
చారుఁడు బహునృపకృతోపచారుఁడు నిరహం
కారుఁడు సాంగానంగా
కారుఁడు సన్నుతపచఃప్రకారుఁడు సభలన్.

147


కవిరాజవిరాజితము.

జలధిగభీరుఁడు శాంతవికారుఁడు శాస్త్రవిహారుఁడు సౌమనసా
చలవరధీరుఁడు శశ్వదుదారుఁడు సంహృతవైరుఁడు శంభుపదా
చలితవిచారుఁడు సాదిమసారుఁడు సత్పరివారుఁడు సర్వనుతో
జ్జ్వలగుణవారుఁడు సంవిదగారుఁడు సంశయదూరుఁడు సద్విధులన్.

148


గద్యము.

ఇది నిఖిలసూరిలోకాంగీకారతరంగితకవిత్వవైభవ
పింగళియమరనార్యతనూభవ సౌజన్యజేయ సూరయనామ
ధేయ ప్రణీతంబైన ప్రభావతీప్రద్యుమ్నం బనుమహాప్రబం
ధంబునందుఁ బ్రథమాశ్వాసము.