Jump to content

పుట:ప్రభావతీప్రద్యుమ్నము (పింగళి సూరన).pdf/55

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


ఆ.

చిచ్చు లేక చిముడుమచ్చరీఁ డీసుద్ది
వజ్రనాభుఁ డోర్చువాఁడె యకట
యగజపేరు పెట్టి యతివ యెవ్వతొ యింత
చేసె ననుచు మమ్ముఁ జెండుఁ దొలుత.

134


క.

ఆచిత్ర ఫలక మెవ్వరు
చూచిన వెలివిసరి యపుడు సుబ్బెడు నది నీ
వే చూచు పేను జూచుట
యోచంచలనయన యింతయు నెఱుంగుదువే.

135


చ.

ఇతరులు రాకమున్న యది యెక్కడఁ బెట్టినదానవో సుశీ
ఘ్రతఁ గొనితెమ్ము తల్లిఖితుఁ గన్నులఁ జూచినదాఁక నామనం
బతిముదితంబు గా దగజ యారసి యెవ్వని వ్రాసెనో సురూ
పతపస నీకు జోడయినభవ్యుఁడు దుర్లభుఁ డెల్లసృష్టిలోన్.

136


వ.

అనవుడు నక్కాంత యిక్కడ నొక్కచిగురుంబొదరుటీఱమి
నిడినదాన నని యాక్షణంబ తెచ్చి నెచ్చెలియుం దాను
నప్పలకకప్పుఁబావడ యెడలించి.

137


చ.

కలకల నవ్వినట్ల తెలికన్నుల నిక్కమ చూచినట్ల తోఁ
బలుకఁ గడంగినట్ల కడుభావగభీరత లబ్బినట్ల పెం
పొలయఁ దనర్చి జీవకళ యుట్టిపడన్ శివ వ్రాసినట్టియా
చెలువున కాభిముఖ్యము భజింపఁదలంకెను దాను బోటియున్.

138


ఉ.

చిత్తరు వన్న నిశ్చయముచే నెదురుండి మొగంబు చూడ మో
మెత్తును సత్యపుంభ్రమసమృద్ధిని గ్రమ్మఱుఁ దత్క్షణంబ లో
నొత్తుచుఁ దత్తఱంబుఁ ద్రపయున్ మగుడంగ నిరీక్షణేచ్ఛఁ బో