Jump to content

పుట:ప్రభావతీప్రద్యుమ్నము (పింగళి సూరన).pdf/52

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


సామ్రాజ్యలక్ష్మీసాక్షత్కారానుకారిణియైన యొక్కకన్య
కామణి తనచెలికత్తియతోడం దత్తటంబునం గ్రొత్తవిరిగుత్తి
మొత్తంబుల నత్యంతంబు చెలువొందు గురివిందపొదరింట
నొంటినుండి యవ్వాలుఁగంటితోడ.

121


చ.

కమలదళాక్షిరో వినవుగా కల యొక్కటి గంటి వేఁకువన్
సమధిక మైనయద్భుత మొనర్చుచు నున్నది యెన్నుకొన్న లో
కమునను గన్నవిన్నయది గా దది కొంతనిజంబు కొంత
స్వప్నము నని పల్కి సిగ్గుకతనన్ మఱి చెప్పక దాఁచె దాఁచినన్.

122


క.

ఒట్టిడుకొంటివి గద నీ
కెట్టిరహస్యంబు దాఁప నే నని మనలో
నిట్టివి గలవా యని చెలి
యట్టే తప్ప దన విరచితాంగీకృతి యై.

123


వ.

ఆకలకంఠి తనకల సకలంబు నకలంకసౌహార్దంబున నిట్లని
వినిపించె.

124


చ.

హిమగిరిరాజకన్య పరమేశ్వరి నాకల సుప్రసన్న యై
విమలదరస్మితామృతము వెల్లువ చెక్కులఁ బిక్కటిల్ల నన్
మమతను జేరఁగాఁ బిలిచి మక్కువచే నను నొక్కకేల మే
నిమురుచు నీకు నొక్కమగనిన్ ఘటియించితినంచుఁ బల్కుచున్.

125


సీ.

సంకల్పమాత్రతక్షణసన్నిధాపితం
             బగుచిత్రఫలకంబునందు నొక్క
పురుషు నత్యాశ్చర్యతరరూపలావణ్య
             గాంభీర్యశౌర్యాదిశుంభదఖిల