Jump to content

పుట:ప్రభావతీప్రద్యుమ్నము (పింగళి సూరన).pdf/5

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గాని రాజ్యతంత్రజ్ఞత నెఱుంగనివాని కారాజ్యమును నిలువఁబెట్టుకొనుట సాధ్యముగాదు. అందుచేతనేగదా, అంతటి మేటిమగలైన రాజపుత్రవీరులందఱును రాజ్యపరిచ్యుతింగాంచినది. మహమ్మదీయరాజ్యము లన్నియు నస్తమించుటకుఁ గారణ మేమి? ఎవ్వరో యక్బరువంటి మహానీతిసంపన్ను లొకరిద్దఱు వినా తక్కిన మహమ్మదీయులందఱును కేవల లోకజ్ఞానశూన్యులే. ఇట్టివారిని జయింప బుద్ధిబలమే పనిచేయవలయుం గాని, బాహుబలము కార్యకారిగాదు.

బృహస్పతియోచనాసామర్థ్యము ప్రస్తుత కార్యసాధనోపాయ మైనది. కాని సంపూర్ణవిజయమునకుఁ జాలినదిగాదు. సర్వతంత్రస్వతంత్రుండైన శ్రీకృష్ణుండు గూడ వజ్రపురప్రవేశమునకు మాత్రము మార్గమును గనిపెట్టగలిగినాఁడు. విజయకార్యమున కెన్నియేని సాధనములు గావలయును. అన్నియు నొక్కరికి స్ఫురించునా? ఒక్కొకబుద్ధి కొక్కొకటి బొడకట్టును. అందువలననే యిట్టి కార్యముల కనేకులు గలసి యోచనఁ జేయవలసివచ్చుచుండును.

ఇంద్రుం డింకొక్కయుపాయమును గనిపెట్టెను. ఇంద్రుని వేగరులు తక్కినయుపాయములను గనిపెట్టినారు. అన్నియును గలిసినంగాని విజయకార్యసన్నాహము సంపూర్ణమైనది కాదు. ఈవిజయమునకుఁ బ్రధానోపకరణములు ప్రభావతీప్రద్యుమ్నులు. వారి కొండొరులపై ఁగలిగిన యనురాగమునకు దైవనియుక్తియె కారణము. అయ్యది శుచిముఖి పరిముఖమున నభివృద్ధిం గాంచినది. రావణుని వినాశమునకు విభీషణుఁడును, శత్రువీరునియం దాతని కుదయమైనభక్తియును గార