Jump to content

పుట:ప్రభావతీప్రద్యుమ్నము (పింగళి సూరన).pdf/42

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


వ.

అది యట్లుండె నవ్విధంబున వివిధోపచారంబుల సంఘటింపఁ
బెంపునం బ్రవర్తిల్లుచుండు యాచండదానవుం డొకానొక
నాఁడు సకలసైనికసన్నాహసంపదం బొదలుచు గదలి
యేతెంచి మదీయమందిరద్వారంబునఁ దనబలంబుల నించి
నిలిచి మాటలాడఁ బని గలిగి వచ్చితి నని లోనికిం జెప్పి
యనుపుటయు నేనును దత్ప్రవేశంబు నడుపం దగువారి
నియమించితి నప్పుడు.

80


చ.

మెఱియల వంటిరక్కసులు మిక్కిలి లెక్కకు మీఱి క్రొవ్వు నే
డ్తెఱయుఁ దలిర్పఁగా వడివడిం దనవెంటనె ద్వారపాలురన్
నెఱి చెడమట్టికొంచుఁ జొర నిర్భరగర్వము నుబ్బుబింకముఁన్
మెఱయఁగ వచ్చి యాయసుర మించె మదగ్రమహాసనస్థితిన్.

81


చ.

బలిమిఁ దదీయు లప్పుడు సభామునిముఖ్యుల రెట్టఁబట్టి యా
తలఁ బడవైచుచుం దమకుఁ దామె యవారణం దత్తదాసనం
బులు గొని కూరుచుండిరి తపోధనులున్ సురలు న్వెడంగుపా
టొలయఁగ గ్రుక్కు మిక్కు మనకుండి రొదుంగుచు నక్కడక్కడన్.

82


ఉ.

యాదవసింహ నాతలఁపు నప్పుడు వారలపా టొకింత యౌఁ
గా దనుదాఁక లేదు గలఁకం బడఁ జొచ్చె ఖలుండు వీఁడు పెం
పేదఁగఁ జుట్టుముట్టి మము నిద్దఱఁ బట్టిన నేది దిక్కు ప్రా
మాదిక మైన మోస మిది మన్మతి కంచు జనించుశంకతోన్.

83


వ.

ఏ నప్పు డుప్పతిల్లెడుమదికలంక యెఱుకపడకుండ గాంభీ
ర్యంబుఁ దెచ్చుకొని తనకు వస్త్రాభరణాదిసంభావన లొనర్చు
టకు వారి వీరిం బిలిచి నియోగించుచు సంభ్రమించుటఁ