Jump to content

పుట:ప్రభావతీప్రద్యుమ్నము (పింగళి సూరన).pdf/40

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


ఉ.

ఆతఁడు మొన్న నున్నతమదాంధత దాడిగ నేఁగుదెంచి యా
పోతర మేమి చెప్ప ననుఁ బూరికిఁ గైకొన కప్సరోవధూ
వ్రాతనిశాతపాణిరుహవారిసలాలసనవ్యపల్లవం
బై తనరారునందనమహావనిలో విడియించె సేనలన్.

72


సీ.

దనుజాధిరోహతాడనభంజనాదుల
             కోర్చునే కల్పవృక్షోత్తమములు
శోష్యపర్యుషితమనుష్యమాంసంబులు
             పూనునట్టివియె సంతానకములు
దానవద్విపఘటాలానతాదురవస్థ
             సైరించునే హరిచందనములు
మనుజఖాదిస్వేదమలినవస్త్రాదులు
             దాల్పఁ బాలివియె మందారతరులు


తే.

నందనమునకును వజ్రనాభదైత్యుఁ
డపుడు చేసినకష్టపా టబ్జనాభ
యిపుడుఁ దలఁపునఁ బాఱిన హృదయమునకు
నధికతర మైనపరితాప మావహిల్లు.

73


తే.

వాని కెదిరించి పోర దేవతలలోన
నెవ్వరును జాల రిది బ్రహ్మ యిచ్చినట్టి
వరములోపలియదియ పంకరుహనాభ
మది కలఁకఁజేసి మును చెప్ప మఱచినాఁడ.

74


వ.

కావున వానిచేత లన్నియు నప్రతిహతంబు లయి సాగు
చుండె నంత నేనును బృహస్పతియును విచారించుకొని
యద్దురాత్మునకు.

75