Jump to content

పుట:ప్రభావతీప్రద్యుమ్నము (పింగళి సూరన).pdf/4

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మార్చుకొనిన మార్పులను బరికించిచూచినచో ఆహా! ఈతని ప్రతిభావిశేషము, సందర్భశుద్ధి, పాత్రౌచిత్యము, గుణపోషణము యెంత శుద్ధముగను, అప్రతిమానముగను గానంబడును?

ఈగ్రంథమునందలి కథాపర్యవసానము వజ్రనాభుఁడు అసమానబలపరాక్రమసంపన్నుఁడు పోటుమగలకడ నెక్కడనో గాని సాత్వికభావ ముండు టరుదు. పూర్వపురాక్షసులందఱును బలపరాక్రమసంపన్నులై తామసగుణప్రధానులై వఱలినవారె. అట్టివారందఱివలెనే యీతఁడును దయావిహీనుం డగుక్రూరకర్ముఁడు. చండశాసనుండు. ఎండయును గాలియును గూడ నీతనిపట్టణమున నితనియాజ్ఞ లేక ప్రవేశింపరాదు. బల మున్నది. పరాక్రమ మున్నది. చండశాసనత యున్నది. దయ లేదు. ఇంక నీతని విజయయాత్ర లెంతదారుణముగ నుండునో చెప్పవలసిన దేమి? రావణుఁడు మున్నగు నిట్టికూరాత్ములందఱికిని భగవంతుఁ డొక్కటిమాత్రము లేకుండఁ బ్రసాదించినాఁడు. ఏమందురా? లౌక్యపరిజ్ఞానము, దూరదృష్టి, దూరశ్రవణము, ఇవిగూడ వీరికడ నుండెనా, లోకమంతయును నశించియేయుండును. ఈవజ్రనాభుఁడు యెదుటివాని మాయమర్మముల నెఱుఁగనివాఁడయినట్టు ఇంద్రునిపై నితఁడు దాడి వెడలినపట్టున నింద్రునివంచనావచనములకు లోనయి గొఁతవఱకు నాతనియింట విం దయియుండి పిమ్మటఁ గొంతకాలమున కెవ్వరివలననో యది మోసకృత్యముగా గ్రహించి ఇంద్రునిఁ దూలనాడి, రాజ్యము నాక్రమించుకొనఁ దలంచినాఁడు. దాని కింద్రుఁడు మఱియొకయుక్తినిఁ బన్నఁగా మఱల నావలలోఁ బడిపోయినాడు. రాజ్యసంస్థాపన బలపరాక్రమములు గలవారికందఱకును, సుకరమే