Jump to content

పుట:ప్రభావతీప్రద్యుమ్నము (పింగళి సూరన).pdf/3

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ములను విష్కంభరూపమున నమర్చుకొని కొలఁదిమార్పులు గావించుకొనినచో, నిది యొకచక్కనినాటక మగును.

ఈగ్రంథమునందలి ఇతివృత్తము కేవలము కల్పితమువలెనే గన్పట్టును. కాని గ్రంథావసానమునం దీతఁడు చొప్పించిన

తే.

"అఘహరణ హరివంశకథాశ్రయంబు
నాత్మపుత్రగుణస్తవనాంకితంబు
నైన యీకావ్యమునకు మహాప్రసిద్ధి
యిచ్చుఁగావుతఁ గరుణ లక్ష్మీశ్వరుండు.”

అనుపద్యమునుబట్టి ఇయ్యది హరివంశమునందలి కథను బట్టి వ్రాసినట్టు లూహింపఁదగియున్నది, కాని హరివంశమునం దీకథ గనుపట్టుట లేదు. ఈకథయందలి ముఖ్యమగుపట్టులన్నియును బరికించిచూచినచో అనిరుద్ధచరిత్రయందలి కథపట్టులే పెక్కులు గానంబడియెడును. ఆయనిరుద్ధచరిత్ర హరివంశములోనిది. ఆకథయందలి శోణపురమే యిందలివజ్రపురము. అచ్చటి పార్వతీవరమాహాత్మ్యమే యిచ్చటి పార్వతీవరమాహాత్మ్యము. అందున్నస్వప్నమే యిందలిస్వప్నము. అచ్చటి బాణాసురవధయె యిచ్చటివజ్రనాభవధ. ముఖ్యాంశము లిందుండి గ్రహించి షేక్స్పియరు మూలగ్రంథములలోని కథను దనయిచ్చ వచ్చినట్టు మార్పుఁ జేసి తననాటకమును రచించి, మూలగ్రంథమునందు లేనిప్రాశస్త్యమును తనగ్రంథమునం దసదృశముగ నెలకొల్పి సర్వోత్కృష్టముగ గ్రంథమును రచియించినట్టు లీతఁ డీగ్రంథమును రచియించినాఁడు. ఈగ్రంథమునం దీతఁడు