Jump to content

పుట:ప్రభావతీప్రద్యుమ్నము (పింగళి సూరన).pdf/20

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

యయ్యది వారివారియంతరభేదముల కనురూపం బగుచునేయున్నది. ప్రభావతి నాయిక. కరుణార్ద్రహృదయ. చెలులకృత్యము తమప్రభుకుమారికల మనస్సునకు వచ్చునటుల భక్తిపూర్వకంబుగఁ బరిచర్య చేయుటయె. అదియె వారివిధ్యుక్తధర్మము. ఏలినవారు నియోగించినపనులు వారి కుపకారకములుగఁ జేయుటయెగాని అందలిమంచిచెడ్డలను విచారించుటకు భృత్యుల కవకాశము లేదు.

చిలుక మొదటినుండియును జంద్రవతీగుణవతులయొద్ద నుండు వినోదపు నెచ్చెలి. వారిమన్మథవేదనఁ జూచి సహింపలేక ద్వారకాపట్టణమునకు వారిప్రియుల నరసి రాయబారము నడపుటకై బయలుదేఱినది. దారినే పోయి దారినే వచ్చు స్వభాసము గలది. కంటిలోనుండి ముక్కులోనికిని, ముక్కులోనుండి కంటిలోనికిని వచ్చెడు త్రాణ దానియొద్ద లేదు. కారుణ్యపరవశత్వమున వజ్రనాభునివార్తాహరణకార్యంబుఁ గైకొని యెన్నియోపాట్లకు లోనయి తుదకుఁ బ్రాణాపాయంబు రా నేలినవారి రహస్యములన్నియును వెలిపఱుపవలసిన దయ్యెను. దైవనియుక్తిచే శుచిముఖ వారి కనుకూలించుదూతిక యైనది కాని లేకున్న వారిపని యధోగతి పాలు కావలసినదియే గద! చేతకానివారలు తమయాయమునకు మించిన పనులను జేకొనిన నిట్లేయుండును. శుచిముఖికిని దీనికినిఁ గల వ్యత్యాస మిందున జూడందగు. ఈచిలుక తనసామర్థ్యం బింతమాత్రంబ యని తాను పూర్ణముగ నెఱుంగు. ఆనుపాను లరయవలయు ననుకుతూహలముగాని శక్తిగాని దానియొద్ద లేదు. దీని దయార్ద్రహృదయము ప్రద్యుమ్నుని ప్రార్థనావచనంబునకు లోనయి