శ్రీరస్తు
ప్రభావతీప్రద్యుమ్న
గ్రంథవిమర్శనము
| చ. | “కవిత యనంగఁ బద్యములు గద్యములున్ రచియించుటౌనె భా | |
(చాటుధార)
సూరనార్యునికాలమునాఁటికి మనతెలుఁగుభాషయందు దృశ్యకావ్యములు లేవు. అన్నియును శ్రవ్యకావ్యములే. ఈతఁడు రాఘవపాండవీయము వ్రాసి తనపాండిత్యప్రకర్షం గనుపఱచినాఁడు. కళాపూర్ణోదయము వ్రాసి కల్పనాచాతుర్యమును కథారచనాచమత్కారమును వెలయఁజేసినాఁడు. రెండింటియందుననుఁగూడ దృశ్యప్రబంధమునం దుండఁదగిన లక్షణములు విశేషముగ లేవు. అట్టికొఱంతఁ బాపం దలంచి యీశ్రవ్యప్రబంధంముననె దృశ్యప్రబంధలక్షణము లన్నియుం బుట్టించి నాటకపాత్రములన్నియు నెదుటకువచ్చి నటించినట్టు లీగ్రంథమును రచియించినాఁడు. ఈప్రభావతీప్రద్యుమ్నమున విశేషభాగము సంభాషణవైచిత్ర్యమే. ఆపట్టుల మనము శ్రద్ధతోఁ బరిశీలించి చదివితిమేని, దృశ్యప్రబంధలక్షణము లెంతవఱ కిం దిమిడియున్నవో తేటతెల్లము గాఁగలదు. ఇం దీతఁడు నెలకొల్పిన రంగస్థలముల జాగరూకతతో విడఁదీసి మధ్యమధ్య సందర్భ