అను నీపైవాక్యమును నీక్రిందిపద్యములను
| శా. | ప్రద్యుమ్నుండు ప్రభావతీరుచిరురూపబ్రహ్మమున్ హంసయో | |
- * * *
| ఉ. | ఉద్యదపేక్షపక్షివనితోక్తులవెంబడిఁ జంచరీకచం | |
| చ. | మది గొనినంతమేరయును మాన కతం డుపమానకోటియొ | |
తత్పూర్వగాథయును సమన్వయించి చూచితిమేని మన మెన్నఁడును కని యెఱుంగనివస్తువు నెట్లు శ్రవణమూలమున మనస్సునకుఁ దెచ్చుకొని తద్రూపమును జూడ సమర్థుల మగుదుమో అయ్యది దృష్టాంతపూర్వకముగ నీకథపట్టున మనకుఁ జూపినాఁడు. ఇందు శ్రవణ మనన నిదిధ్యాస ధ్యాన ధారణ సమాధుల నన్నిటిని వివరించియున్నాడు.
ఈకవి ప్రపంచమునందలి మనఃప్రకృతులను అందలివ్యత్యాసములను ఎంత చక్కగాఁ గనిపెట్టెనో యిం దీతఁడు వర్ణించినప్రభావతీరాగవల్లరులహృదయవర్ణనమును బట్టియును, హంసశుకములప్రవర్తననుబట్టియును గనందగు.