Jump to content

పుట:ప్రభావతీప్రద్యుమ్నము (పింగళి సూరన).pdf/17

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మొదటిదృతియంతయును సడలవిడిచినాఁడు. ముఖవైఖరినిఁ బట్టియు మాటలధోరణినిఁ బట్టియు మనుజులహృదయమును గనిపెట్టఁగలిగిన శుచిముఖి యాతనియాంతర్యమును గ్రహించి యింక ముందటివ్యాపారమున మునుపటివలె నాతనికి ఆనుపానులఁ జెప్పక యావిషయమున ముభావముగ నుండెను. అంతఁ బ్రద్యుమ్నుఁడు వజ్రపురప్రవేశమునకు మార్గ మరయఁ దొట్రుపడుచు అది నీవే చెప్పి పుణ్యముఁ గట్టుకొనుమని శుచిముఖిని బ్రతిమాలుకొనియెను. ఈరెండుపట్టులను వినియోగపడిన కవియొక్క మేధావిశేషమును గాంచితిమేని, ఆతఁడు పాత్రములస్వభావగుణపోషణమునం దెంత సమర్థుఁడో యెఱుకపడక మానదు. ఆంతరంగికమర్మముల వర్ణించుపట్టున తనకున్న నే ర్పనుపమానము, ఈతఁ డెంతసేపు వర్ణించినను హృదయభావములును అందు నిమిషనిమిషమునకును గలుగుచుండుమార్పులును తత్సంకీర్ణభావములును దారతమ్యభేదములతో నీషత్తైనను వెలిపోకుండ నిలుపుకొనివచ్చుచు నం దత్యంతకుతూహలుండై మెలంగు.

ప్రద్యుమ్నుఁడు శుచిముఖికి వ్రాసిన యుత్తరములోని యీక్రిందిభాగమును బట్టి అతఁడు ప్రభావతీరూపము నెట్లు మనంబున నిలుపఁగలిగెనో అయ్యది యేగతి నాతనిమనంబున కెక్కెనో తెలియఁగలదు.

"అయింతియంగము లెవ్వి యెట్లు చెప్పి, తవియెల్ల నట్లు నాయాత్మఁ దద్దయుఁబడి యచ్చున సద్దిన ట్లమర నంటి, మలిచినగతిని మిక్కిలి దృఢత్వముఁ జెంది స్వగుణసంపద్గౌరవమున నేమొ, యూఁది బడలించుచున్నవి యో మరాళి."