పాటు లేవియు లేకుండఁ బ్రేక్షకులకుఁ దనయాంతర్యోద్దేశము లేవియును నెఱుకపడనీయకుండ, కేవల మదియే వృత్తిగాఁగలనటుఁడు ప్రవర్తించినటుల ప్రవర్తించి విజయము నందినాఁడు. ఇయ్యది కేవలమును గథాకార్యనిర్వహణమునకే కల్పింపఁబడియెనో సూరనార్యుని ప్రద్యుమ్నుఁడే ఇట్టివాఁడో మన మారసి చూడవలయు. ప్రద్యుమ్నపాత్రప్రవేశము మన కెట్లు జరిగినది? అశ్వము నెక్కి కందుకక్రీడ సేయుతఱి ఆతఁడు మనకు రంగమునఁ బ్రప్రథమమున నగపడినాఁడు. ఆక్రీడావిశేషసమయమునఁ గవి యాతని వర్ణించినవర్ణనను బట్టి యాతని కెట్టిశరీరలాఘవ మున్నదో ఆయావిద్యలయం దతని కెంత నేర్పు గలదో యెఱుకపడుట లేదా? ఆతనియుత్తరప్రవర్తన కీపూర్వరంగప్రవర్తన మంతయును సమంజసముగ లేదా? అదియునుంగాక శ్రీకృష్ణుఁడు ప్రద్యుమ్నుని వర్ణించుపట్టున
| చ. | బలవిభవాభిశోభితుఁ డభంగురశౌర్యధురంధరుండు కా | |
అని చెప్పియున్నాడు. ముందు తనపాత్రమున కెట్టిప్రవర్తన మలవరింప నెంచెనో యందునకుఁ దగిన యుపపత్తి ముందుగనే గల్పించి మొదటినుండి చివరవఱకు నాతనిప్రవర్తన మంతయును సరసముగ నిలిపికొని వచ్చినాఁడు. మొదట శుచిముఖి యాతని సందర్శించినతఱి నెంతయో గుట్టుగ నుండి తనమనం బేమియు నెఱుకపడనీయక అందునుగూర్చి యొక్కమాటయయిన నాడుటగాని యేదయిన నడుమ నొకపృచ్ఛ సేయుటగాని లేకుండనుండి యెంతయో బెట్టుగనున్న యాతఁడు, రెండవసారి శుచిముఖి యాతని సందర్శించినపట్టున