| చ. | మదితమిఁ జూడఁ గొన్ని వెడమాటలు పల్కితి..... | |
ప్రద్యుమ్నుఁడు రాజకుమారుఁడు పురుషుఁడు వ్యవహారజ్ఞుఁడు. అట్టియాతఁడు చప్పున తనమనస్సు బైటఁబెట్టువాఁడు కాఁడు. కార్య మనుసంధానము గావలయు. తాను వార్తాహరణకృత్యము పూనియున్నది. ఆకృత్యము నెఱవేఱుట 'కెప్పటి కెయ్యది ప్రస్తుతమో అప్పటి కామాట' లాడవలయు. శుచిముఖికడనున్న కార్యసంధానవిధానతత్పరతయు, నెదుటిహృదయమర్మము లెఱుంగునేర్పును, మఱియొకరికడ లేవు. అందువలన శుచిముఖి తనకార్యము నిర్వహించుకొనుటకై తానే అప్రస్తుతప్రసంగము గాకుండఁ జక్కగ సమయము గనిపెట్టి ఆమె రూపలావణ్యాదుల నభివర్ణించి యాతనిమనస్సున కెక్కించినది. అతనిమనంబు బయటఁ బెట్టుకొనకుండుటకుఁ గారణములు రెండు. మొదటిది శుచిముఖిపేరఁ బనిచినయుత్తరంబున నిట్లు వచియింపంబడియున్నది.
| సీ. | ప్రప్రభాభావతిఁ బలుదెఱంగుల నీవు, వచియింప నపుడు నిర్వచనవృత్తి | |
రెండవది యాతనిస్వగతవాక్యంబున నిట్లు జెప్పుకొని దలపోసినాఁడు.
| చ. | ఇది పదిలంబుగా నడుగ కే నపు డక్కట! కోర్కి దాఁచి వ | |
ప్రద్యుమ్నునకు ఆతనిమాయానటసలమూలమునఁగాని వజ్రనగరప్రవేశముఁ గలుగదు. ఆతఁడు వృత్తిచేత వేషధారి గాఁడు. పుట్టుకచే రాజకుమారుఁడు. అట్టియతఁడు లోటు