నందలిధృతి తగ్గzనా, అందువలన నెంతటి విపరీతములైన నుత్పన్నము లగు. వారియెడ సాహసము హెచ్చు.
ఇంకొక్కటిఁ గూడఁ బరిశీలించి చూడవలయు. ప్రద్యుమ్నునిఁగూర్చి ప్రభావతికిఁ జెప్పెడుపట్టున, నామె నూరించి యూరించి చెప్పుటకును, ప్రశ్న వేయుటయేతడవుగఁ బ్రద్యుమ్నునికడ కథయంతయును నేకరువు పెట్టుటకును, కారణమును తెలిసికొనవలయును. స్త్రీలకు స్వభావముచేతఁ జాపల్యము హెచ్చు. చాపల్యమువలనఁ గలిగిన యేభావముగాని స్థిరముగ నిల్చియుండదు. అందువలన మనస్సును గట్టిగఁ బట్టిచూచిననే గాని, అది యెంతవఱకు స్థైర్యముగనుండునో యెఱుకపడదు.
ఎవనికిఁగాని, విశ్వప్రయత్నముమీఁద లభ్యమైన పదార్థమునం దున్నంతప్రీతి, అప్రయత్నలబ్ధపదార్థముమీఁద నుండదు. ఏపదార్ధముగాని మనకు దూరమునం దున్నది యని యనుకొనినంతవఱకు దానియందు మన కభిరుచి హెచ్చుగా నుండును. మననము హెచ్చయి దానియందె తదేకధ్యానము కలిగినచో అయ్యది హృదయస్థమయి యూడఁబెఱుకనలయునన్నను నూడిరానంతటి మనోనిశ్చలత యేర్పడును. అట్టిపరీక్ష చపలచిత్తలగు స్త్రీలయం దెక్కుడుగ నావశ్యకము.
ఇది మోహపరీక్షకే యుద్దేశింపఁబడినట్టు కవియే యీక్రిందిపద్యముల వ్రాసినాఁడు—
| చ. | అది తలపోసి కుందఁదగు నా యదునందనునందు నున్న నా | |