ప్రాప్తమైనది గాదు. దీనికిఁ గారణములు రెండు. శ్రవణసాహాయ్యమునకన్న, ఈక్షణసాహాయ్యమున, వస్తుగుణాగుణములు శీఘ్రతరద్యోతకములు. అందువలనఁ బ్రభావతికి శీఘ్రముగ మనస్సు చలించుటకును, ప్రద్యుమ్నున కట్టిది కలుగకుండుటకునుఁ గారణమైనది. అదిగాక ప్రద్యుమ్నుడు ధృతిమంతుఁడు. ధృతిమంతునకును వీరునకును ధైర్య మొకపట్టునఁ జదరరాదు. వీరుల మనస్థైర్యము లొకపట్టునఁ జెడక నిలుచునట్టివి గనుకనె వా రేకార్యమునందును నిశ్చలులై నిల్చుటయును, అయ్యది పూర్ణము గావించుకొనినంగాని అందుండి మనస్సును గదలి రానీయకుండుటయును, గాంచుచున్నారము. ఏవీరునైననుం జూడుఁడు. ఇట్టి ధృతిరాహిత్య మెచ్చటనైన నున్న దేమో? ఇది రెండవకారణము. ఒకసారి యీతఁడు వినినసంగతులన్నియును మనస్సున కెక్కినవి. మననము ప్రారంభమైనది. ప్రస్ఫుటమైన యనురాగ మంకురించినది. అప్పటినుండి ప్రభావతికివలెనే అతనికి సివమెత్తినది. ఉభయులకును దృఢమోహము మనస్సున నిలిచి యింక మృత్యువే శరణ్యముగా నుభయులు నెన్నుకొనినపిమ్మట వారి యుభయులకును మైత్రి సంఘటిల్లినది. స్త్రీలధైర్యము పురుషులధైర్యమునకన్న నధికమయినది. సఖీజనస్వభావం బెంతటిమన్మథబాధాసమాధీనం బైనను గర్తృపక్షావలంబి గాదు. అట్టిపక్షం బెల్లవేళల పురుషస్వభావంబు ననుసరించియుండు. అట్టిచో నియ్యెడ విరుద్ధధర్మాచరణము గానంబడినది. దాని కేమి కారణము? 'భావన చేసి చూడ క్షణభంగుర మింతులతాల్మికల్మి వా, తావిలపల్లవాంచలహిమాంబుకణంబును నంతకంటె మేలు' అని కవియే దానిని వ్యక్తీకరించి యున్నాడు. ఒకసారి స్త్రీలమనంబు
పుట:ప్రభావతీప్రద్యుమ్నము (పింగళి సూరన).pdf/13
స్వరూపం