యును దెలిసినవిషయమె యనునది పాఠకులకందఱకును గ్రాహ్యమే. అందువలన రహస్యపరిరక్షణ కేలోటును గలుగలేదు. ఇంక స్వభావవిరుద్ధప్రవేశ మేల యందురా? ఆకాలపుఁగవులకును బాఠకులకును స్వభావవిరుద్ధకార్యములయినను అద్భుతరసాపూర్ణము లయినంగాని సంతోషదాయకంబులు గాకుండెడివి. షేక్స్పియరువంటి మహాకవిగూడ నీస్వభావవిరుద్ధకార్యములఁ దననాటకపాత్ర కలవరించి యున్నాఁడు. ప్రద్యుమ్నుఁడు మాయావి. 'నహి మాయాయా మసంభావ్య మస్తి' యను నుక్తి నొసంగి అతనికి మాయానటనలయందుఁ గలసామర్థ్యమును గనఁబఱిచినాఁడు. అట్టియద్భుతము లాకాలపువారలకు వింతగాఁ గనఁబడునవిగావు. అంతియెగాని యిట్టియద్భుతకల్పనల నలవరించిన సూరనార్యున కీమాత్రపుమార్గాంతరము దొరకినది గాదనుట కేవల మసంగతము.
ప్రభావతీ ప్రద్యుమ్నుల విరహావస్థలు వర్ణించుపట్టున మఱియొకవైచిత్ర్యము గనందగు. ప్రభావతీవిరహవేదనకుఁ గారణము కనుకలి. ప్రద్యుమ్నునకు వినుకలి. ప్రభావతికిఁ జిత్రపటమును జూచుటతోడనే కుతూహలము ప్రారంభమయి అయ్యది క్రమక్రమముగ విరహవేదనగ మాఱి ప్రాణాపాయమునుగూడ దెచ్చునంతటిది యైనది. ప్రద్యుమ్నునకుఁ గూడ నంతిమావస్థ యిట్టిదియెగాని ప్రథమావస్థయం దిరువురస్థితికి నెంతయో వ్యత్యాసమున్నది. ఈవ్యత్యాసమునకుఁ గారణ మేమియో యూహింపవలసియున్నది. ప్రభావతికి ప్రథమావస్థయందే ధైర్యసంచలనము. ప్రద్యుమ్నునకు శుచిముఖివర్ణన పూర్ణమయి యాసందేశహారి పోయినవెనుకఁగాని అట్టిది సం