Jump to content

పుట:ప్రభావతీప్రద్యుమ్నము (పింగళి సూరన).pdf/11

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


చ.

అని తనుఁ గూర్చి దానవకులాగ్రణిపైఁ దెగ లేని చింత సే
యు నధిపుఁ గోటలగ్గలకు నుగ్రత డగ్గఱు భూరిసైన్యుఁ దం
డ్రినిఁ బరికించి యింతి విభునిం దము గాచికొనంగ నేఱత్రో
వ నెమకి కాన కంతఁ బితృవత్సలభాపముఁ బాఱనూకుచున్.

ఈపైమార్గముగాక ఆవీరున కనురూపంబయిన మార్గము మఱియొక్కటి యెవ్వరైనఁ జూపుదురా?

ప్రద్యుమ్నునియంతఃపురప్రవేశము కేవలమును స్వభావవిరుద్ధముగ నున్న దేమి? ఇంక గత్యంతరము లేక సూరనార్యుఁ డట్లు వ్రాసినందురా? గత్యంతరము లేకపోలేదని చెప్పుటకు గదసాంబుల ప్రవేశము నిదర్శనము లేదా? అచ్చటఁ గలిగినమార్గ మిచ్చట యేల లేకపోయినది? “గదసాంబులప్రవేశము ప్రద్యుమ్నప్రవేశానంతరము. ప్రద్యుమ్ను నంతటి సమర్థుఁడు అంతఃపురమునం దున్నాడు గనుక నట్టిమార్గము పొసంగెను. లేకున్న రహస్యభంగ మయిపోవు” నని చెప్పుదురు కాఁబోలు? రహస్యభంగ మగుటకుఁ బూర్వమునకును బరమునకును భేదము లేదు. అట్టిరహస్యములు నిగూఢములుగా నుంచుటకు అంతఃపురపరిచారికల సహకారము లేకుండ నిట్టికార్యము లెప్పుడును బొసంగనే పొసంగవు.

చ.

అరయఁగఁ దల్లి కక్క చెలియండ్రకుఁ దక్కును గల్గినట్టిచు
ట్టరికమువారికి న్నెరయ డాచురహస్యము లీనిజాంతర
స్మరవికృతిప్రవర్తనల మాటలు వీని వినంగ నాప్తలై
పరగెడు నెచ్చెలుల్ చెలికిఁ బ్రాణము లిచ్చిన నప్పు దీరునే.

అనుపద్యమునుబట్టి, రాగవల్లరి మున్నుగాఁగల యంతఃపురపరిచారికల కందఱకును ఈసమాచారము మొదటినుండి