పుట:ప్రపంచ చరిత్ర - మొదటి భాగము.pdf/98

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

96

ప్రపంచ చరిత్ర


సైన్యపు దాడికి గ్రీకులు వెనుకకు మరలిరి. థర్మాపిలె అను కనుమవద్ద పర్షియను సైన్యము నాపవలెనని నిర్ధారణ చేసికొనిరి. ఇది సన్నని మార్గము. ఒకతట్టు పర్వతమున్నది. రెండవతట్టు సముద్రమున్నది. ఈ ప్రదేశమున కొద్దిమంది సైనికులు పెద్ద సైన్యము నాపగలుగుదురు. 300 స్పార్టనులతో లియెనిదాస్ ఈ కనుమను మరణపర్యంతము రక్షించుటకు నియమింపబడెను. మారథాన్ యుద్ధము జరిగిన పదిసంవత్సరముల పిమ్మట ఆ ప్రఖ్యాతదినమున ఆ అసహాయశూరులు తమ మాతృదేశమున కమూల్యసేవ యొనరించిరి. గ్రీకు సైన్యము మరలిపోవుచుండగా పర్షియనుల మహాసైన్యము నీ వీరులు అరికట్టిరి. ఆ ఇరుకు కనుమలో, వీరుని వెంబడి వీరుడు, నేలకొరిగెను. వీరునివెంబడి వీరుడు వారిస్థలముల నాక్రమించెను. పర్షియనుల సైన్యము ముందుకు కాలుపెట్ట లేకపోయేను. పర్షియనులు సాగిపోవుటకుముందు లియెనిదాసును, అతని సహచరులు 300 మందియు థర్మాపిలెలో వీరస్వర్గము నందిరి.. క్రీ. పూ. 480 సంవత్సరమున నీ యుద్ధము జరిగెను. 24 10 సంవత్సరములకు పూర్వము జరిగినప్పటికిని ఆవీరుల అప్రతిమాన శౌక్యమును నేడు తలచుకొన్నప్పటికిని శరీరము పులకలెత్తును. నేడు సైతము ధర్మాపిలెను దర్శించు బాటసారి, కన్నీరునిండిన నేత్రములతో, శిలాఫలకముపై చెక్కిన సందేశము - లియెనిదాసు యొక్కయు, అతని సహచరుల యొక్కయు సందేశము - చదువగలడు.

“పొమ్ము, స్పార్టాతోడ చెప్పుము
 తెరుపరీ : మా విన్నపంబును,
 ఆమెయానతి తలనువాల్చి
 బరిగితిమి ఈ కనుమలోనని."

మృత్యువును జయించు ధైర్యము అద్భుతావహముగదా ! లియెనిదాసును, థర్మాపిలెయును చిరంజీవులు. దూరదేశమగు ఇండియాలోనున్న మనము సైతము వారిని తలచుకొని పులకరించుచున్నాము. ఇక మన