పుట:ప్రపంచ చరిత్ర - మొదటి భాగము.pdf/97

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పర్షియా : గ్రీసు

95


మనము జ్ఞాపకముంచుకోవలసిన విషయ మేమనగా - గమ్యస్థానమును చేరగలుగుటకు ముందు మనము గొప్ప ఆవదల నెదుర్కొనవలేను.

రాజాధిరాజైన జరక్ససు తన సైన్యమును ఆసియా మైనరుగుండ తీసికొనిపోయేను. ఆ రోజులలో హెల్లస్పాంటు అని పిలువబడు డార్టినెల్సుగుండా యూరోపు ప్రవేశించెను. త్రోవలో పూర్వకాలమున గ్రీకు వీరులు హెలన్‌కొరకు పోరాడిన ట్రాయిపట్టణ శిథిలములను చక్రవర్తి దర్శించెనని చెప్పుదురు. హెల్లస్పాంటు కడ్డముగా సైన్యము దాటుటకు పెద్ద వంతెన కట్టబడెను. పర్షియను సేనలు దాటుచుండగా సమీపమందున్న కొండపై చలువరాతి సింహాసనమున కూర్చుండి జరక్ససు చూచు చుండెను,

హెరొడోటస్ చెప్పుచున్నాడు. "జరక్ససు నావలలో నిండియున్న హెల్లస్పాంటును చూచెను. తీరములన్నియును, అవాస్ మైదానములును సైనికులతో నిండియుండుట చూచెను. నే నెంత యదృష్టవంతుడను, అని యాతడనుకొనెను. మరుక్షణముననే యతడు విలపింపదొడగెను. హెల్లాను(గ్రీసు) మీదకు దండెత్తి పోవలదని మొదట ధైర్యముగా సలహాచెప్పిన ఆర్టవానసు చక్రవర్తి విలపించుట చూచి యిట్లడిగెను-- "ఓ. రాజా, నీ విప్పుడు చేసిన పనులు పరస్పరము ఎంత విరుద్ధముగా నున్నవి? నీ యంత యదృష్టవంతుడు లేడని చెప్పి వెంటనే కన్నీరు కార్చుచుంటివి." చక్రవర్తి చెప్పిన సమాధాన మేమనగా “అవును, సర్వమును చూచినపిమ్మట నా మనస్సునకు తట్టి, జాలి పుట్టించిన విషయ మేమనగా....మస యెదుట కనిపించు జనసమూహములో ఒక్కడును నూరు సంవత్సరములు గడచిన పిమ్మట జీవించియుండడు గదా? మానవుని జీవిత పరిమాణ మెంత స్వల్పము ! "

ఈ మహాసైన్యము భూమార్గముస ముందుకు కదలెను. సముద్ర మార్గమున పెక్కు నావలు వారి నంటివచ్చుచుండెను. కాని సముద్రము గ్రీకులయెడ పక్షపాతము చూపెను. తుపానులో నావలను పెక్కింటిని నాశముచేసెను. గ్రీకులు ఈ మహాసైన్యమును చూచి భయపడి, తమలో తమకుండు భేదములను మరిచి, ఏకమై శత్రుపు నెదుర్కొనిరి, పర్షియను