పుట:ప్రపంచ చరిత్ర - మొదటి భాగము.pdf/86

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

84

ప్రపంచ చరిత్ర


పర్షియాలో అప్పుడున్న మతమునకును, భావములకును నూతన స్వరూపమునిచ్చి నూతన మార్గమున నడిపించెనని చెప్పుట మంచిదేమో? అంతకుపూర్వ మెంతోకాలమునుండి ఈమతము పర్షియాలో లేదనియే చెప్పవచ్చును. పర్షియానుండి చిరకాలముక్రిందట ఇండియాకు వచ్చిన పారశీకులు ఈమతమును తమతోకూడ తెచ్చుకొనిరి. నాటినుండి దాని నాచరణలో పెట్టుచుండిరి.

ఈకాలమున చినాలో కంప్యూసియస్, లోచే అను గొప్ప పురుషు లిద్దరుండిరి. కప్యూసియస్ పేరు నిర్దుష్టముగా వ్రాయవలెనన్న నిట్లుండ వలెను - కాంగ్‌ప్యూచే. సామాన్యార్ధమున వీరిద్దరును మతస్థాపకులు కారు. నీతిమార్గములను, సంఘమనుసరించవలసిన సదాచార మార్గములను వారేర్పరచిరి. చేయదగినపని, చేయరానిపని వారునిర్ణయించిరి. వారి మరణానంతరము వారిపేర పెక్కుదేవాలయములు చీనాలో స్మారక చిహ్మములుగా నిర్మింపబడినవి. హిందువులు వేదములను, క్రైస్తవులు బైబిలును గౌరవించు విధముగా చీనాదేశస్థులు వారి గ్రంధములను గౌరవించుచుండిరి. కంప్యూసియస్ బోధనల ఫలితమే మన, చీనాదేశస్థులు పెద్దమనిషి తరహా, గౌరవముగా నడచుకొనుట, సౌజన్యము, విజ్ఞాన సంపన్నత అలవరచుకొనిరి.

ఇండియాలో మహావీరుడు, బుద్ధుడు ఉండిరి. నేడున్న జైనమతమునుస్థాపించిన పురుషుడు మహావీరుడు. అతని అసలు పేరు వర్దమానుడు. మహావీరు డను బిరుద మాతని గొప్పతనమును సూచించునది. పశ్చిమ హిందూస్థానములోను, కథియవారులోను జైనులధికముగా నివసించుచున్నారు. నేడు వారినితరుచు హిందువులలో చేర్చుదురు. కథియవారులోను, రాజపుత్రస్థానములోని ఆబూపర్వతమందును వారికి సుందరమగు దేవాలయములు గలపు. అహింస పరమధర్మమని వారు నమ్ముదురు, ఎట్టి ప్రాణికిని హానికలుగువిధముగా ఎట్టికార్యమును వారుచేయరు. ఈ సందర్భమున పైతాగొరస్ శాకాహారి యనియు, తన శిష్యులనందరిని