పుట:ప్రపంచ చరిత్ర - మొదటి భాగము.pdf/83

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ధన మెచ్చటికి పోవును?

81


టకు బదులు, పూజించి శాంతికై నైవేద్యము లర్పించెడివారు. ప్రకృతి వన్యమృగమైనట్లును, దానిని మంచిచేసికొని శాంతింప జేయవలసినట్లును వారి ఊహ. పిడుగులు, మెఱుములు, అంటువ్యాధులు వారిని భయపెట్టెను. నై వేద్యములపల్లనే వాటిని వారింపవచ్చునని వా రూహించిరి. అమాయకులనేకులు సూర్య చంద్ర గ్రహణములు భయంకర విపత్తులని భావింతురు. అవి ప్రకృతిలో జరుగు సామాన్య సంఘటనలని గ్రహించుటకు బదులు జను లనవసరముగా ఆవేశపూరితులై , సూర్య చంద్రులను రక్షించుటకై స్నానములు చేసి ఉపవాసము లుందురు. సూర్య చంద్రులు తమ్ము తాము రక్షించుకొను స్థితిలోనే ఉన్నారు. వారికొరకై మనము బెంగపడ నవసరములేదు. .

నాగరీకము, విజ్ఞానము ఎట్లు అభివృద్ధిచెందినవో తెలిసికొంటిమి. గ్రామములలోను, పట్టణములలోను ప్రజలు నివాసము లేర్పరచుకొనుటతో ఇవి ప్రారంభించినవని తెలిసికొంటిమి. ఆహారపదార్థము లధికముగా వచ్చుచుండుటచే వారికి తీరిక చిక్కినది. వేట, తిండి గాక మరి యితర విషయములనుగూర్చి వా రాలోచించగలిగిరి. ఆలోచనలు వృద్ధిపొందిన కొలది కళలు, వృత్తులు, విజ్ఞానము వృద్ధినందెను. జనసంఖ్య వృద్ధియైన కొలది జనులు సన్నిహితముగ నివసించుట యవశ్యమైనది. వారు ఒక రొకరిని ఎప్పుడును కలుసుకొనుచున్నారు. ఒకరితోనొకరు పనిబెట్టుకొనుచున్నారు. కలిసిమెలిసి ఒక్కచో నుండవలసివచ్చినప్పుడు ఒకరి మంచి ఒకరు చూడవలయును. తమ స్నేహితులకుగాని, పొరుగువారికిగాని ఇబ్బంది కలిగించుపనులు వారు చేయరాదు. అట్లుకానిచో సాంఘిక జీవనమే పొసగదు, దృషాంతముగా ఒక కుటుంబమును తీసికొనుము. కుటుంబము సంఘముయొక్క ఒక చిన్న తునుక. అందలి జను లన్యోన్యముగా నున్న వారు సుఖముగా జీవించగలుగుదురు. అన్యోన్యానురాగ ముండును కాబట్టి కుటుంబములో సుఖజీవనము కష్టసాధ్యము కాదు. ఒక్కొక్కప్పుడు మనము ఇతరుల కష్టసుఖములను గమనించకుండ మెల