పుట:ప్రపంచ చరిత్ర - మొదటి భాగము.pdf/72

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

70

ప్రపంచ చరిత్ర


ముగా కులపెద్దలు రాజ్యము చేతుపద్దతి క్షీణించిపోయినది. కేంద్ర ప్రభుత్వము తలయెత్తి అభివృదిలోనికి వచ్చినది. సర్వాంగ శోభితమగు రాజ్యము పొడచూపినది. ప్రాచీనకాలమందు సైతము వ్రాత యను కళ చీనాకు తెలియును. కాని చీనావారి వ్రాత మన వ్రాతకు భిన్నముగా నుండును, ఇంగ్లీషు, ఫ్రెంచివ్రాతలకును భిన్నముగా నుండును. దానికి అక్షరమాల లేదు. వారి వ్రాత చిహ్నముల రూపముననో, బొమ్మల రూపముననో ఉండును.

640 సంవత్సరములు పరిపాలనచేసిన పిమ్మట షాంగ్ వంశము విప్లవము కారణముగా అంతరించెను. పిమ్మట ఒక క్రొత్త వంశము - చౌవంశము-ప్రభుత్వమునకు వచ్చెను. ఈ వంశము షాంగ్ వంశము కన్న ఎక్కువకాలము ర్యాజముచేసెను. ఇది 867 సంవత్సరములు నిలిచెను. ఈ వంశము రాజ్యముచేయుచున్న కాలమునందే చీనా రాజ్యము సర్వాంశోభిత మయ్యెను. ఈ కాలమునందే చీనా తత్త్వజ్ఞు లిద్దరు-కంప్యూసియస్ అను నతడును, లోచే అను నతడును నివసించియుండిరి. ముందు ముందు వీరిని గురించి కొంత నేర్చుకొందము.

షాంగ్ వంశమును ప్రజలు తరిమివేసినప్పుడు, వారి పెద్దయుద్యోగులలో ఒకడైన కీచే అనువాడు చౌవంశమువారిని కొలుచుట కిష్టపడక దేశాంతరవాసము చేసెను. 5000 మంది అనుచరులతో అతడు చీనా విడిచి కొరియాకు పోయెను. ఆ దేశమున కీతడు చోజన్ అను పేరు పెట్టెను. చోజన్ అనగా ఉదయప్రశాంతి గల దేశము అని యర్థము. కొరియా (చోజన్ ) చీనాకు తూర్పుగానున్నది. కాస కీచే తూర్పుగా ఉచయసూర్యునిపైపు వెళ్లెనన్నమాట. బహుశా అతడు కొరియాకు తూర్పుగా ఇక దేశములేదని తలచియుండవచ్చును. అందువల్ల నే ఆపేరాదేశమునకు పెట్టెను. కిచేతో కొరియాచరిత్ర ప్రారంభమయ్యెను. ఇది క్రీస్తు పుట్టుటకు 1100 సంసత్సరములకు ముందుమాట. ఈ క్రొత్త దేశములో కీచే చీనాదేశకళలను, .శిల్పవృత్తులను, గృహనిర్మాణమును, వ్యవసాయమును పట్టుపరిశ్రమను ప్రవేశపెట్టెను. చీనా నుండి పలువురు