పుట:ప్రపంచ చరిత్ర - మొదటి భాగము.pdf/71

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వేయి సంవత్సరముల చీనా చరిత్ర

69


గత మయ్యెను. 400 సంవత్సరముల పైకాలము హిసియావంశము చీనాను పరిపాలించెనని చెప్పుదురు. చిట్టచిపరి హిసియా చక్రవర్తి మిక్కిలి క్రూరుడై యుండుటచే ప్రజలు తిరుగుబాటు చేసి యతనిని పదభ్రష్టుని చేసిరి, షంగ్ వంశము, లేదా ఈన్ వంశము అని చెప్పబడు వేరొకవంశము తరువాత ప్రభుత్వమునకు వచ్చెను. సుమారు 650 సంవత్సరములపాటు ఈ వంశము రాజ్యము చేసెను.

వేయి సంవత్సరములకు పైబడిన చీనా చరిత్రను ఒక చిన్న పేరాలో, రెండుమూడు వాక్యములతో నేను చెప్పి వేసితిని. విశాలమగు చరిత్ర భాగముల నిట్లు చేయగలుగుట ఆశ్చర్యకరముకాదా ? కాని నా చిన్న పేరామాత్రము 1000. లేదా 1100 సంవత్సరముల కాలమును కుదించలేదని నీవు గ్రహించవలెను. రోజులు, నెలలు, సంవత్సరములలో కాలమును గణించుటకు మన మలవాటు పడితిమి. నూరు సంవత్సరముల కాల మననేమో స్పష్టముగా ఊహించుట మనకు కష్టము, నీ వయస్సు పదమూడు సంవత్సరములు ఎంతో పెద్దకాలముగా కనిపించును కాదూ? ఒక్కొక్క సంవత్సరము గడచినకొలది నీపు పెద్దదాస వగుచుందువు. ఇట్టి సందర్భములో వేయి సంవత్సరముల చరిత్రయన నీవెట్లు గ్రహించగలపు : అది దీర్ఘ కాలము. తరమువెంబడి తరము వచ్చును, పోవును, పట్టణములు గొప్ప నగరములగును. పిమ్మట శిథిలమగును. వాటి స్థానే క్రొత్తసగరములు జన్మించును. కడచిన వేయి సంవత్సరముల చరిత్రను తలచుకొనుము, అప్పుడు బహుశా ఈదీర్ఘ కాలము నీ కర్థముకావచ్చును. ఈ వేయి సంవత్సరములలో ప్రపంచమం దెట్టి యాశ్చర్యకరమగు మార్పులు కలిగినవో ?

చిరవిజ్ఞాన సంప్రదాయములతోను, 500 లేదా 600 సంవత్సర ములో. అంతకు పైబడియో నిలిచిన వంశములతోను కూడుకొన్న చీనా చరిత్ర అద్భుత మైనది.

ఒక పేరాలో నేనుముగించిన 1100 సంవత్సరములలో చినా ఎంత మందముగా అభివృద్ధి జెందినదో ఊహించుకొనుము. క్రమ క్రమ