పుట:ప్రపంచ చరిత్ర - మొదటి భాగము.pdf/70

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

68

ప్రపంచ చరిత్ర

ప్రాచీనచరిత్రలో ఇండియాకు సోదరియైన చీనాకు పోదము. చీనాలోను, తూర్పు ఆసియాలోని ఇతర దేశములైన జపాను, కొరియా, ఇండోచీనా, సయాం, బర్మాలలోను ఆర్యుల ప్రశంసరాదు. ఇచ్చటనున్న వారు మంగోలియా జాతులు.

5000 సంవత్సరములకు పూర్వమందో, అంతకంటెను పూర్వమందో పడమటినుండి చీనాపై దండయాత్ర వచ్చినది. దండయాత్ర చేసిన తెగలుకూడ మధ్య ఆసియానుండియే వచ్చినవి. వారు నాగరీకమున కొంత వృద్ధిచెందినవారే. వ్యవసాయము వారికి తెలియును. వారు పశువుల మందలను పెట్టుకొనుచుండిరి. మంచి యిండ్లు కట్టుట వారికి వచ్చును. వారి సంఘము బాగుగా అభివృద్ధి జెందియుండెను. వారు హోయాంగ్‌హో. అనగా పచ్చనదివద్ద నివాసము లేర్పాటుచేసికొని రాజ్యతంత్రమును నిర్మించుకోనిరి. చాలా వందల సంవత్సరముల కాలములో చీనా దేశమును వారు వ్యాపించిరి. వారి శిల్పములను, కళలను వృద్ధిజేసికొనిరి. చీనాప్రజలు ముఖ్యముగా వ్యవసాయదారులు. వారి నాయకులు నిజముగా కులపెద్దలే, వీరినిగురించి ఇదివరలో నీకు వ్రాసియుంటిని. 6, 7 వందల సంవత్సరములకు తరువాత - అనగా నేటికి 4000 సంవత్సరములకు పూర్వము - యావో అను పురుషు డొకడు చక్రవర్తి యనిపించుకొన్నట్లు మనకు తెలియుచున్నది. ఇతడు చక్రవర్తి బిరుదమును పెట్టుకొన్నప్పటికిని కులపెద్దవంటివాడే కాని ఈజిప్టు, మెసపొటేమియాల నేలిన చక్రవర్తులవంటివాడు మాత్రముకాడు. చీనాప్రజలు వ్యవసాయదారులుగానే ఉండిపోయిరి. కేంద్రప్రభుత్వము వారికి లేదు.

తమ ప్రజలచే కుల పెద్ద లెన్నుకొనబడెడివారని నీకు చెప్పియుంటిని. తరువాత ఆ పదవి వంశపరంపరగా సంక్రమించుచుండెను. చీనాలో ఇట్లు సంభవించెను. యావో అనంతరము అతని పుత్రుడు చక్రవర్తి కాలేదు. దేశమునందు మిక్కిలి సమర్దుడగువాని నింకొకనిని అతడే నియమించెను. కొంతకాలమైన పిమ్మట చక్రవర్తి బిరుదము వంశపరంపరా