పుట:ప్రపంచ చరిత్ర - మొదటి భాగము.pdf/61

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్రాతసంప్రదాయముల భారము

59


యన్నియు అప్రధానవిషయములు. జనాభాకొరకే వాని ప్రాధాన్యము, ఇండియాలోనున్న అసలు భాషలు — ఈ విషయ మిదివరలో నీకు వ్రాసితినేమో - రెండు కుటుంబములకు చెందియున్నవి. ఒకటి ద్రావిడ కుటుంబము. దీనిని గురించి పైని చెప్పియున్నాను. వెండవది ఇండో ఆర్యను కుటుంబయి. ప్రధానమగు ఇండో ఆర్యనుభాష ఇండియాలో సంస్కృతమే. ఇండియాలోని ఇండో ఆర్యనుభాష లన్నిటికిని సంస్కతము మాతృక. అవి హిందీ, బెంగాలి, గుజరాతీ, మరాటీ భాషలు, ఇవికాక అస్సాంలో అస్సామీసు భాషయు, ఒరిస్సాలో (ఉత్కళము) ఓడ్ర భాషయు వాడుకలోనున్నవి. హిందీభాష భిన్నస్వరూపమే ఉర్దు. హించూస్తానీ అనుమాట హిందీకిని, ఉర్దుకునుకూడ చెల్లును. కాన ఇండియా ప్రధానభాషలు సరిగా పది. హిందూస్తానీ, బెంగాలీ, గుజరాతీ, మరాటీ, తమిళము, తెలుగు, కన్నడము, మళయాళము, ఓడ్రము, అస్సామీను. ఈ భాషలో మన మాతృభాషయైన హిందూస్తానీ ఉత్తర హిందూస్థానమందంతటను వాడుకలో నున్నది - పంజాబులో సంయుక్త రాష్ట్రములలో, బీహారులో. మధ్యరాష్ట్రములలో, రాజపుటానాలో, ఢిల్లీలో, మధ్య ఇండియాలో. ఇది పెద్ద భూభాగము. ఇంచు 15 కోట్ల మంది నివసించుచున్నారు. కొద్ది తేడాలతో 15 కోట్ల మంది అప్పుడే హించూస్తానీ మాటాడుచున్నారుగదా. ఇంతేకాదు. హిందూస్తానీ భాష ఇండియా అన్ని ప్రాంతములందును అర్థమగుచున్నమాట నీకు బాగుగా తెలియును. అది ఇండియా కంతకును సామాన్య భాష కాగలదు. ఇందువల్ల, పైన నేను చెప్పిన ప్రధానభాషలు అంతరించిపోవలె నని అర్థముకాదు. అవి రాష్ట్రభాషలుగా ఉండవలసినదే. ఎందువల్ల ననగా. వాని సారస్వతములు చక్కనివి. సర్వతోముఖముగా అభివృద్ధిగాంచిన భాషను, అభాష మాటాడు ప్రజలకు కాదని తీసివేయుట కెవ్వరును. ఎప్పుడును ప్రయత్నించరాదు. స్వభాషద్వారానే ప్రజలు వృద్ధిగాంతురు. వారి పిల్లలు విద్య నభ్యసింతురు. నేడు ఇండియాలో సర్వమును తల