పుట:ప్రపంచ చరిత్ర - మొదటి భాగము.pdf/59

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్రాతసంప్రదాయముల భారము

57


చున్నవి. మన పూర్వుల ఆచార వ్యవహారములు, వారి ఊహాపోహలు, వారి జీవనపద్దతిపై గ్రంథాదులనుండి మనము గ్రహించవచ్చును. కాని అవి నిర్దుష్టచరిత్రకాదు. తరువాత కాలమునాటికి సంబంధించిన యథార్థచరిత్ర ఒకటి సంస్కృతములో నున్నది. అది కాశ్మీరదేశమును గురించి. ఈ గ్రంథముపేరు రాజతరంగిణి. గ్రంథకర్త కల్హణుడు. కాశ్మీరరాజుల చరిత్ర ఇందు వర్ణితము. విన్నావో లేదో, [1]రంజిత్ మామ ఈ గొప్ప కాశ్మీర చరిత్రను సంస్కృతమునుండి ఇప్పుడే తర్జుమా చేయుచున్నాడు. సుమారు సగముగ్రంథ మప్పుడే పూర్తిఆయనది. అది చాల పెద్దపుస్తకము. తర్జుమా పూర్తిఅయినపిమ్మట మన మందరము తప్పక దాని నుత్సాహముతో చదువుదము. దురదృష్ట వశాత్తు మనకు చాలినంత సంస్కృతజ్ఞానము లేకపోవుటవల్ల సంస్కృత గ్రంథము చదువలేము. అది చక్కని గ్రంథమని మాత్రమేకాదు దానిని మనము చదువుట, అది గతకాలమునుగూర్చి అనేక విషయములు చెప్పును. ముఖ్యముగా కాశ్మీరమునుగురించి, నీ వెరుగుదువా. కాశ్మీరము మన పూర్వుల జన్మభూమిసుమా !

ఆర్యులు ఇండియాలో కాలు పెట్టుసరికి ఇండియా నాగరికతగల దేశముగానే యుండెను. వాయవ్యదిశనున్న మొహంజొదారొవద్ద దొరికిన శిథిలములనుబట్టి చూచిన, ఆర్యులు రాకముందే ఇక్కడ నాగరికత గొప్పగా నుండెనని ధ్రువపడుచున్నది. కాని దీనినిగురించి మన కింకను ఎక్కువగా తెలియదు. పురాతన వస్తు శాస్త్రజ్ఞులు — అనగా ప్రాతశిథిలములను పరీక్ష చేయువారు - అక్కడ దొరుకు పదార్థముల నన్నింటిని త్రవ్వి బయటకు తీసినపిమ్మట, కొద్ది సంవత్సరములలో మన కింకను ఎక్కువ విషయములు తెలియవచ్చును.

ఈ విషయ మిట్లుండనిచ్చినను, ఆకాలమున దక్షిణ హిందూదేశమున-బహుశా ఉత్తర హిందూస్థానమునకూడా- ద్రావిడులు గొప్ప

  1. రంజీత్, యస్. పండితుడు. జవహర్లాలు భావమరిది. అప్పుడతడు గూడ చెరసాలలో నున్నాడు.