పుట:ప్రపంచ చరిత్ర - మొదటి భాగము.pdf/58

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

56

ప్రపంచ చరిత్ర


క్రితము వ్రాసిన మేళముల వృత్తాంతములు చదువుకొన్నాను... అప్పుడు కూడ మేళములు ప్రాచీన సంప్రదాయమేసుమా - రమణీయముగా నుండును. కాని మనము ముందుకు పోదలచినప్పుడీ గొలుసు మనల నంటుకొనియుండును. సంప్రదాయబద్ధులమైన మనము చేయి కాలు కదుప లేము. భూతకాలముతో సంబంధము మనము నిలుపుకొనవలసినదే కాని మన పురోభివృద్ధికి ఆటంకముగానుండు సంప్రదాయమును మాత్రము విచ్చిన్నము చేయకతప్పదు.

2500, 3000 సంవత్సరములకు పూర్వము ప్రపంచమెట్లుండెనో తెలిసికొనుటకు వెనుకటి మూడుత్తరములలోను ప్రయత్నించితిమి. నేను తేదీలను, సంవత్సరములను ఉదహరించలేదు. తేదీలు, సంవత్సరములు అన్న నా కిష్టములేదు. నీవుకూడ ఆ గొడవ పెట్టుకోకు. ప్రాచీన కాలమున నే సంవత్సరమున నేమి సంభవించెనో సరిగా తెలిసికొనుట కష్టము, పోనుపోను కొన్ని తేదీలు జ్ఞాపకముంచుకొనుట అవసరమగును. మనస్సులలో సరియైన క్రమమున జరిగిన సంగతుల నుంచుకొనుట కాతేదీ పనికివచ్చును. ప్రస్తుతము మనము ప్రాచీన ప్రపంచస్వరూపమును తెలిసికొన ప్రయత్నించుచున్నాము.

గ్రీసు, మధ్యధరాప్రాంతము, ఈజిప్టు, ఆసియామైనరు, పర్షియా లనుగురించి కొంత తెలిసికొంటిమి. ఇప్పుడు మనము మన దేశమునకు తిరిగివత్తము. హిందూదేశముయొక్క తోలుతటి చరిత్రను గురించి తెలిసికొనుట కొక పెద్ద యిబ్బంది ఉన్నది. తొలుతటి ఆర్యులు - వీరినే ఇండో-ఆర్యులు అందురు. - చరిత్ర లేమియు వ్రాయలేదు. వారు ఎన్నివిధములుగానో ఎంతో గొప్పవారని వెనుకట ఉత్తరములలో మనము చూచియుంటిమి. వారు ప్రచురించిన గ్రంథములు, వేదములు, ఉపనిషత్తులు, రామాయణము, మహాభారతము ఇంకను ఇతర గ్రంథములు మహామహులు రచించినవై యుండవలెను. ప్రాచీనచరిత్రను తెలిసికొనుట గ్రంథములును, ఇతర సామగ్రియు సహాయకారు లగు