పుట:ప్రపంచ చరిత్ర - మొదటి భాగము.pdf/57

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్రాతసంప్రదాయముల భారము

55


నా అలవాటు చొప్పున నేడు నక్షత్రము లుండగనే నేను లేచితిని. తెల్లవారుటకు ముందు గాలిలో ఏదో ఉండును. దానినిబట్టి తెల్లవారుచున్నదని మనము గ్రహింపవచ్చును. నేను కూర్చుండి చదువుకొను చుండగా, దూరమునందుండి కంఠధ్వనులు, కోలాహలము అంతకంత కతిశయించుచు వినిపించి ఉదయకాల ప్రశాంతిని చెడగొట్టినవి. అది సంక్రాంతి దినమని జ్ఞాపకము చేసికొంటిని. మాఘమేశోత్సవమున మొదటిదినమది. గొప్పదినము. త్రివేణీసంగమస్థలమున ప్రాతఃస్నానము చేయుటకు యాత్రికులు వేలకువేలు నడిచి వెళ్లుచున్నారు. గంగాయమునలును, (అంతర్వాహినిగాన) అగోచరమగు సరస్వతియును కలిసి త్రివేణీ సంగమ మేర్పడుచున్నది. నడుచుచు వారొకప్పుడు పాటలు పాడుచుండిరి; ఒకప్పుడు “గంగా మాయికి జై " అని జయధ్వనులు చేయుచుండిరి. నాయిని చెరసాలగోడలు దాటి వారి కంఠధ్వనులు నా చెవుల బడెను. బహుళ సంఖ్యాకుల నీ నదివద్దకు లాగుకు వచ్చినట్టియు, తాత్కాలికముగా వారు తమ దరిద్రమును, దుఃఖమును విస్మరించునట్లు చేసినట్టియు భక్తిప్రభావ మెట్టిదోగదా యనుకొంటిని. సంవత్సరము సంవత్సరము త్రివేణిలో స్నానము చేయుటకై ఎన్నివందల, లేదా ఎన్ని వేల సంవత్సరములనుండి యాత్రికులు వెళ్లుచున్నారోగదా యనుకొంటిని. మనుష్యులురావచ్చును. మనుష్యులు పోవచ్చును, రాజ్యములు, సామ్రాజ్యములు కొంతకాల మధికారము చలాయించవచ్చును. తరువాత భూత కాలములో అంతరించిపోవచ్చును. కాని ప్రాచీన సంప్రదాయము ఒకే విధముగా సాగిపోవుచుండును, తరతరములవారు దానిని శిరసా వహించుచుందురు. సంప్రదాయ సిద్ధమగు ఆచారములో మంచి చాలా ఉన్నది. ఒక్కొక్కప్పుడది. దుర్భరభార మగును. ముందు సాగి పోవుటకు మన కది యాటంకములు కల్పించును.

అస్పష్టము, దూరము అగు భూతకాలముతో సంబంధము కలుపు అవిచ్ఛిన్నమగు ఈ గొలుసును తలుచుకొన్నాను. 1300 సంవత్సరముల