పుట:ప్రపంచ చరిత్ర - మొదటి భాగము.pdf/36

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

34

ప్రపంచ చరిత్ర


పరిమాణమునుబట్టి ఆసియా గొప్పదనియు, యూరోపు పరిగణింపదగ్గది కాదనియు అర్ధము చేసికొనరాదు. ఒక మానవుని యొక్కగాని, దేశముయొక్క గాని ఘనతను నిర్ణయించుటకు పరిమాణము తుచ్ఛసాధన మగు చున్నది. ఖండములలో కెల్ల చిన్నదైనను యూరోపు నేడు ఉన్నత స్థితిలో నున్నదని మనకు తెలియును. ఆఖండమందలి దేశము లనేకములకు దివ్యమగు చరిత్రభాగము లుండినవనికూడ మనకు తెలియును . ఆదేశములలో గొప్పశాస్త్రజ్ఞులు పుట్టిరి. వారు కొత్త విషయములు కనిపెట్టుటవల్లను, నూతనసాధనములుకల్పించుటవల్లను మానవ నాగరీకమును అత్యుచ్ఛస్థితికి తెచ్చిరి. కోట్లకొలది స్త్రీ పురుషుల జీవితభారమును తగ్గించిరి. ఆదేశములలో గొప్ప గ్రంథకర్తలు, తత్త్వజ్ఞులు, చిత్ర కారులు, గాయకులు, కార్యశూరులు ఉద్భవించిరి. యూరోపు ఘనతను ఒప్పుకొనకుండుట తెలివితక్కువ..

కాని ఆసియాఘనతను మరచిపోవుటకూడ అంతటితెలివితక్కువే. యూరోపు తళుకుబెళుకులు కొద్దిగాచూచి మనము మోసపోయి, గతమును విస్మరించవచ్చును. ఆసియాలోనే తత్త్వజ్ఞులు తలచూపిరి. లోకమున వారిప్రభావ మప్రతిమానమైనది. ప్రధానమతములను స్థాపించిన ఆచార్యపురుషులు వారు. ఈ విషయము మనము మరచిపోరాదు. నేడున్న మతము లన్నింటికన్న ప్రాచీనమైన హిందూమతమునకు జన్మభూమి ఆసియా, నేడు చీనా దేశములోను, జపాను, బర్మా, టిబెట్టు, సిలోను చేశములలోను కాలు నిలువద్రొక్కుకొన్న సోదరమతము బౌద్దముకూడ ఆసియాలో జన్మించినదే. యూదుల మతము, క్రైస్తవమతముకూడ ఆసియాలో పుట్టినవే. ఆసియాకు పశ్చిమతీరమందున్న పాలస్తీనాలో అవి తలయెత్తినవి. పారశీకుల మతమగు జొరోష్ట్రియన్ మతము పర్షియాలో ప్రారంభమైనది. అరేబియా దేశములోని మక్కా పట్టణమున మహమ్మదు ప్రవ క్త జన్మించెను. కృష్ణుడు, బుద్ధుడు, జొరాష్ట్రరు, క్రీస్తు, మహమ్మదు, చీనా దేశ తత్త్వజ్ఞులగు కంప్యూసియసు, లావోచే - ఆసియాలో పుట్టిన