పుట:ప్రపంచ చరిత్ర - మొదటి భాగము.pdf/35

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆసియా : యూరోపు

33


గ్రామ పరిసరముల నున్నవి. బహుశా 5000 సంవత్సరములకు పూర్వమందున్న కాలమునకు సంబంధించిన ఈ శిధిలములను త్రవ్వితీసిరి, ఈజిప్టులోని రక్షిత మానవకళేబరములవంటి కళేబరములుకూడ కనుగొనబడినవి. ఇదంతయు ఆర్యులు వచ్చుటకు పూర్వము - వేలకొద్ది సంవత్సరముల క్రితమసుమా! అప్పుడు యూరోపు ఒక అరణ్యమై యుండును.

నేడు యూరోపు బలముగాను, శక్తివంతముగాను ఉన్నది. అందలి ప్రజలు ప్రపంచమునందంతలోను నాగరీకులమనియు, విజ్ఞానవంతుల మనియు ననుకొనుచున్నారు. ఆసియాయన్నను, ఆసియాలోని ప్రజలన్నను వారికి ఈసడింపు. ఆసియా ఖండమందలి దేశములకు వచ్చి చేత చిక్కిన దెల్ల వారాదేశములనుండి గ్రహించుచున్నారు, కాల మెట్లు మారినది: యూరోపును, ఆసియాను పరిశీలించి చూతము. అట్లాసును తెరిచిచూడుము. పెద్దదగు ఆసియాఖండమున కంటుకొని చిన్నదగు యూరోపు ఎట్లున్నదో చూడుము. ఆసియా కొద్దిగా విస్తరించుటవల్ల యూరోపు తయారై నట్లున్నది. నీవు చరిత్ర చదివినప్పుడు నీకు విశదమగు విషయ మేమనగా...దీర్ఘ మగు కొన్ని కాలములపాటు ఆసియా ప్రబలముగా నుండెను. ఆసియాప్రజలు తడవులు తడవులుగా వెళ్ళి యూరోపును జయించిరి. యూరోపునువారు ధ్వంసముచేసిరి. యూరోపునకు వారు నాగరీకము నిచ్చిరి. ఆర్యులు, సిథియనులు, హూణులు, అరబ్బులు, మంగోలులు, తురుష్కులు -- వీరందరును ఆసియా ఏమూలనుండియో వచ్చి ఆసియాయూరోపులను క్రమ్ముకొనిరి. జట్టిమిడుతలవలె అధిక సంఖ్యాకులగు వీరిని ఆసియా ఉత్పత్తిచేసినది. నిజమునకు యూరోపు చిరకాలము ఆసియావలసభూమిగా నుండెను. నేటి యూరోపులో నున్న ప్రజలు పెక్కురుఆసియానుండి దండెత్తి పోయినవారి సంతానమే. కాళ్లు చేతులు చాపుకొని పడియున్న గొప్ప ఎడ్డెరాక్షసుని మాదిరి దేశపటమున కడ్డముగా ఆసియా వ్యాపించియున్నది. యూరోపు చిన్నది. ఇట్లనిన