పుట:ప్రపంచ చరిత్ర - మొదటి భాగము.pdf/28

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

26

ప్రపంచ చరిత్ర


చేయవలెనను భావము - అనగా సహకారభావము ఎట్లు వృద్దియైనదో నేను కొన్ని యుత్తరములలో వ్రాసియుంటిని. లోకకళ్యాణముకొరకు మనమందరముకలిసి పనిచేయుట మనయాదర్శముగా పెట్టుకొనవలయుననియు కొన్ని లేఖలలో నేను నీకు తెలియజేసితిని. కాని ఒక్కొక్కప్పుడు పెద్దచరిత్రభాగములను చూచినప్పుడు ఈఆదర్శము ముందడుగువేసినదా యని సందేహము కలుగును; మనము నాగరీకులము, అభివృద్ధి చెందితిమి అని చెప్పుటకు నోరాడదు. నేడు సహకారలోపము కావలసినంత యున్నది. స్వార్థపరత్వముతో ఒక దేశ మింకొకచేశముపైని, ఒకజాతి యింకొక జాతిపైనిబడి పీడించుచున్నవి. ఒకమానవు. డింకొక మానవుని లోబరుచుకొని లాభమందుచున్నాడు. కోట్లకొలది సంవత్సరముల యభివృద్ధి యనంతరమున మన మిట్టి హీనస్థితిలో, లోపములతో నున్నప్పుడు వివేకము, విజ్ఞానముగల మానవులవలె సంచరించుట నేర్చుకొనుటకు మరెంతకాలముపట్టునో ? ఒక్కొక్కప్పుడు, మన కాలమున కంటెను మెరుగుగా కనిపించు గత కొలము గురించి మనము చరిత్రలో చదువుదుము. అప్పటివారెక్కువ విజ్ఞానవంతులుగను, నాగరీకులుగను కనిపింతురు. ఇది చదివినప్పుడు మనలోకము ముందుకు పోపుచున్నదో, వెనుకకు పోవుచున్నదో చెప్పుట సందేహాస్పదముగా నుండును. గతకాలమున మన దేశచత్రలో, నిస్సంశయముగా, దీవ్యత్ ఘట్టములు కలవు. నేటికాలమునకన్న నన్నివిధముల నుత్తమమైనవి. .

పలుదేశములలో గతకాలమున దివ్యఘట్టము లున్నమాట వాస్తవమే - ఇండియాలో, ఈజిప్టులో, చీనాలో, గ్రీసులో, ఇంకను ఇతర దేశములలో. ఈ దేశములలో అనేకము హీనస్థితికి పడిపోయిన మాట కూడ వాస్తవమే. ఇట్లు జరిగినప్పటికిని మన మదైర్యము జెందరాదు, ప్రపంచము విపులమైనది. కొంతకాలముపాటు ఒకదేశము ఉచ్ఛస్థితికి వచ్చినను. నీచస్థితికి పడిపోయినను దానివలన లాభముగాని, నష్టముగాని మొత్తము ప్రపంచమునకు ఉండదు.