పుట:ప్రపంచ చరిత్ర - మొదటి భాగము.pdf/27

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

2

చరిత్ర మనకేమి బోధించును?

జనవరి 5, 1934

చిట్టీ. నీకు నే నేమి వ్రాయను? ఎక్కడ మొదలు పెట్టను? గత కాలముకు స్మరించినంతనే అసంభ్యాకములగు చిత్రములు నామనస్సులో పరుగులుదీయును. కొన్ని చిత్రములు మిగతవానికన్న ఎక్కువకాలము నిలుచును. అవి నాకు ప్రియమైనవి. వానినిగురించి నేను మననము చేయ ప్రారంభింతును. అనుకొనకుండనే గతసంఘటనలను నేటి సంఘటనలతో పోల్చుచును. అందుండి నాకు మార్గదర్శకముగా నుండు ఉపదేశములను కనుగొనుటకు ప్రయత్నింతును. కాని మానవునిమనస్సు ఎంతటి వింత కలగూరగంప? సంబంధములేని ఆలోచనలు, క్రమము తప్పిన చిత్రములు దానినిండ యుండును. అది ఒక క్రమములో చిత్రపటము లమర్చిని ఒక చిత్రశాలవంటిది. అయితే తప్పు పూర్తిగామనది కాదు. మనలో పెక్కురము తమ మనస్సులలో జరిగిన కార్యము లొక క్రమపద్ధతిని ఇంతకన్న చక్కగా నమర్చుకొనగలముకాని ఒక్కొక్కప్పుడు ఆకార్యము లెంతో వింతగా క్లిష్టముగా నుండి ఏక్రమపద్ధతిలోను ఇముడవు.

ప్రపంచము నెమ్మదిగానై నను నిస్సందేహముగా నభివృద్ధిజెందిన దనియు, సామాన్య అల్పజంతువులు పరిణమించి పెద్ద జంతువులుగా మారినవనియు, చివరకు ఉత్తమజంతువగు మానవుడు వచ్చినాడనియు మేధాశక్తివలన నితరజంతువులను మించినాడనియు చరిత్ర మనకు భోధించవలయునని ఇదివరలో నీకు వ్రాసి యుంటినని నా యూహ. అనాగరికస్థితినుండి నాగరిక స్థితికి మానవుడు అభివృద్ధి చెందివచ్చుటయే చరిత్ర చెప్పవలసిన యంశమందురు. జనులందరును కలిసి మెలసిపని.