పుట:ప్రపంచ చరిత్ర - మొదటి భాగము.pdf/25

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సంవత్సరాది బహుమానము

23


కాలమునుగూర్చియు, గతకాలమున నివసించి, ప్రపంచ నాట్యరంగమున పెద్దపాత్రలు ధరించినట్టి పురుషులను గూర్చియు నీకప్పుడప్పుడు వ్రాయుదును.

నా జాబులు నీకిష్టముగా నుండునో లేదో. అవి సీ కౌతకమును రేపెట్టునో లేదో నేను చెప్పలేను. నిజమునకు వాని నెప్పుడు నీవు చూతువో, అసలు చూతువో లేదో కూడ నాకుతెలియదు. చిత్రము; మన మంత సమీపములో నుండియు ఇంతదూరముగానున్నాము. ముస్సోరీలో నీవు ఎన్నియో వందల మైళ్ళదూరములో నున్నావు. అయినను నాకిష్టమై నన్నిమారులు నేను నీకు జాబులు వ్రాయగలను. నిన్ను చూడవలెనని గట్టిగా బుద్ధిపుట్టిన నేను నీకడకు పరుగెత్తిరాగలను. ఇప్పుడు మనము యమునానది కద్దరిని ఇద్దరిని, ఉన్నాముగదా ! దూరములో లేముగదా ? అయినను నాయినీచెరసాల ఎత్తైనగోడలు మనలను కలిసికోకుండ చేయుచున్నవి. పక్షమున కొక జాబు నేను వ్రాయవచ్చును. పక్షమున కొకజాబు నాకురావచ్చును. పక్షమునకొకసారి ఇరువదినిముషములపాటు మిత్రులో, బంధువులో నన్ను సంచర్శించి మాటాడుటకు రావచ్చును. అయినప్పటికి ఇట్టి కట్టుబాట్లు మంచివే. సులభముగా లభించు వస్తువులపై మనకు గౌరవముండదు. కారాగారానుభవము వాంఛింపదగిన విద్యాశిక్షణ యని నాకు నానాటికి నమ్మకము కలుగుచున్నది. ఎంతయదృష్టమో కాని నేడు మనదేశప్రజలు వేలకొద్ది యిట్టి విద్యాశిక్షణ నందుచున్నారు.

ఈ జాబులను నీవు చూచి ఇష్టపడుదువో లేదో నేను చెప్పజాలను. నా యానందముకొరకే నేను వీనిని వ్రాయ సంకల్పించితిని. అవి నిన్ను నా సమీపమునకు తీసికొనివచ్చును, నీతో సంభాషణ చేయుచున్నట్లే నేను భావించుకొందును. తరుచుగా నేను నిన్ను తలచుకొనుచుందును. ఈ రోజున నా మనస్సులో నీవులేని క్షణములేదు. ఈదినము సంవత్సరాది. తెల్లవారుజామున పరుపుపై పరుండి నక్షత్రములను చూచుచు గతించిన సంవత్సరమును గురించియు, అది తెచ్చి పెట్టినఆశలు, సంతాప