పుట:ప్రపంచ చరిత్ర - మొదటి భాగము.pdf/24

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

22

ప్రపంచ చరిత్ర


గూర్చి నేను నీకు వ్రాసియుంటిని. అప్పుడు వ్రాయుట నాకు సులభముగానే యుండెను. ఏలయన ఆకాలమునకు సంబంధించిన విషయములు మనకు స్పష్టముగ తెలియవు. అతి ప్రాచీనకాలమునుండి వెలువడినతోడనే చరిత్ర క్రమక్రమముగా ప్రారంభమగును, మానవుడు ఏవిధ ప్రాంతముల తన వింతజీవితయాత్ర ప్రారంభించును. ఒకప్పుడు వివేకయుక్తముగాను, వేరొకప్పుడు పిచ్చిగాను, తెలివితక్కువగాను ఉండు మానవుని చర్యలను గ్రహించుట సులభసాధ్యముకాదు. గ్రంథసహాయమున గ్రహించుటకు మనము ప్రయత్నించవచ్చును. కాని నాయినిచెరసాలలో పుస్తకభాండాగారము లేదు. పూర్వాపరసందర్భములతో ప్రపంచచరిత్ర నీకు చెప్పవలేనని యున్నదిగాని అట్లుచేయుట సాధ్యముకాదని తోచుచున్నది. బాల బాలికలు ఒక్క దేశముయొక్క చరిత్ర మాత్రమే నేర్చుకొనుట - అదైనను ఏవో కొన్ని సంవత్సరములు, కొన్ని యంశములు కంఠస్థము చేయుట - నా కెంతమాత్ర మిష్టములేదు. అన్యోన్యసంబంధము కలిగి సమగ్రముగా నుండునది చరిత్ర . ప్రపంచమున ఇతరభాగములందు జరుగు వృత్తాంతములు తెలిసినగాని ఏయొక్క దేశచరిత్రయైనను నీ కర్థముకాదు. ఒకటిరెండు దేశములకు సంబంధించిన చరిత్రను మాత్రమే, యిట్టి సంకుచికపద్ధతిని నీవు నేర్చుకోవని నమ్ముచున్నాను. ప్రపంచచరిత్రను పరీక్షచేయుదు వనియు నమ్ముచున్నాను.

మన మనుకొనునట్లు వివిధ మానవవర్గములలో గొప్ప భేదము లేదని సదా జ్ఞప్తియం దుంచుకొనుము. పటములును, అట్లాసులును వేర్వేరు రంగులతో దేశములను మనకు ప్రదర్శంచును. మానవులలో భేదములున్న మాట వాస్తవమేకాని వారిలో దగ్గర పోలికలుకూడ ఉన్నవి. పటములలోని రంగులను బట్టిగాని, దేశముల పొలిమేరలనుబట్టిగాని మనము భ్రమపడరాదు. ఈవిషయమును మనము మనస్సులో పెట్టుకో పలెను.

నాకిష్టమున్న చరిత్ర నుగూర్చి నేను నీకు వ్రాయజాలను. గత