పుట:ప్రపంచ చరిత్ర - మొదటి భాగము.pdf/20

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

18

ప్రపంచ చరిత్ర


చిక్కులు మున్నగువానినిగూర్చి వారు తంటాలు పడుచుందురు. కాని ఒక మహత్కార్యము సాధించుటకై ప్రజలు పూనుకొనవలసిన తరుణము వచ్చినప్పుడు సామాన్య స్త్రీ పురుషులు సైతము వీరులగుదురు. చరిత్ర యుద్రేక పూరిత మగును. నవయుగారంభమగును. మహాపురుషులలో నేదియో శక్తి యిమిడి యున్నది. వారు ప్రజలలో నావేశము పుట్టించి వారిచే ఘనకార్యములు చేయింతురు.

నీవు పుట్టిన సంవత్సరము (1917) చరిత్రలో జ్ఞప్తియందుంచు కొనవలసిన సంవత్సరములో నొకటి. అప్పు డొక మహానాయకుడు ఆర్తులపట్లను, పేదలపట్లను కరుణా రసపూరిత హృదయుడై ఎన్నటికిని విస్మరింపరాని గొప్ప అధ్యాయమును చరిత్రలో తన ప్రజలచే వ్రాయించెను. నీవు పుట్టిన నెలలోనే లెనిన్ మహా విప్లవమును ప్రారంభించెను. దానిచే రష్యా, సైబీరియాదేశముల స్వరూపమే మారిపోయెను. నేడు ఇండియాలో వేరొక మహానాయకుడు-ఆర్తజనరక్షణ పరాయణుడు, మన ప్రజలను పౌరుషమునకు పురిగొల్పి వారిచే మహాత్యాగములు చేయించెను. మరల వారు స్వేచ్చనందుటకును, క్షుధార్తులు, దరిద్రులు, పీడితులు భాఛా విముక్తి నందుటకును ఈ మహాప్రయత్నము. బాఫుజీ (గాంధీ మహాత్ముడు} చెరసాలలో నున్నాడు. కాని యా మహాపురుషుని సందేశ మను ఇంద్రజాలము హిందూదేశ ప్రజాకోటిహృదయముల బ్రవేశించెను. స్త్రీలు, పురుషులు, చిన్నపిల్లలు సైతము తమ చిన్నగూళ్ళనుండి బయటికి వచ్చి ఇండియాకు స్వాతంత్ర్యము సంపాదింప సైనికులైరి. ఇండియాలో మనమిప్పుడు చరిత్రను సృజించుచున్నాము. మన కన్నులముందు జరుగు నీ విషయములు నీవును, నేనును చూచుచున్నాము. ఈ మహోద్యమమున మనమును శక్తికొలది పాల్గొనుచున్నాము. మన మెంతటి యదృష్ట వంతులమో!

ఈ మహోద్యమముపట్ల మన మెట్లు మెలగవలెను? మస మేమి చేయవలెను? ఏమి మనపాలబడునో నేను చెప్పజాలను. అది యేమైనను